Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[?]

సీ.

[1]అత్త మామయుఁ దల్లి యన్నలు మఱదులు
              గలుగ కింటికిఁ దాన కర్తయైన
పుట్టినింటనె యున్నఁ బొరుగిల్లుఁ ద్రొక్కినఁ
              దీర్థోత్సవములకుఁ దిరుగుచున్న
పరదేశమున నున్నఁ బరపురుషుల గోష్ఠిఁ
              బ్రియము పుట్టిన నాజ్ఞ వెట్టకున్న
జారకాంతలతోడి సంసర్గ చేసిన
              గులధర్మ మెంతయుఁ [2]గుతిలపడిన


తే.

మగడు ముసలైన మిక్కిలి మలినుఁడైన
దూర మరిగిన దీనుఁడై చేరకున్న
కఠినరతుఁడైన నేప్రొద్దుఁ గలహియైన
సతి పరద్వారి యగు నెల్లజాతులందు.

171

కేయూరబాహుచరిత్ర [3-225]

[3]సీ.

మగనివారెవ్వరు మందిరంబున లేక
              జవ్వనంబునఁ దన చనవయైన
నెల్లకాలము పుట్టినింటనె నిల్చిన
              యాత్రోత్సవములకు నరుగుచున్నఁ
బని లేక పొరుగిల్లు పలుమాఱు ద్రొక్కిన
              మగవారితో గోష్ఠి మానకున్న
చెడ్డయింతులతోడి చెలిమి యొనర్చిన
              వరుఁడు ప్రవాసైకనిరతుఁడైన


తే.

విభుఁడు గొనబైన మిక్కిలి వృద్ధుఁడైన
బచనికాఁడైన నెప్పుడుఁ బరుసనైనఁ
దన్ను మెచ్చక యొకతెను దగిలెనేనిఁ
జెడక తక్కదు ధర నెట్టి పడఁతియైన.

172

ఉభయకవి లక్కాభట్టు - శతపక్షిసంవాదము

[4]శా.

నీవీబంధము వీడు మోవి యదరున్ నేత్రంబు లల్లాడుఁ జ
న్గ్రేవ ల్గానఁగ వచ్చుఁ గ్రొవ్వెడ విరుల్ పృథ్వీస్థలిన్ రాలు హృ
ద్భావాగారము లోనఁ జెమ్మగిలుఁ జిత్తం బుత్తలంబొందు నా
నావిభ్రాంతులు పుట్టు నింతులకుఁ బొంతన్ వింతవారుండినన్.

173
  1. క.అన్న
  2. గ.గుటిల
  3. క.లో లేదు.
  4. క.లో లేదు.