తే. |
రజతగిరియందుఁ దాండవారంభరభస
భంగిపతిత[1]పరశ్వథపాణివికట
కంధరా[2]రుద్ధగజ[3]కృత్తికంథశంక
ప్రమథులకుఁ దోఁప నంధకారంబు ప్రబలె.
| 164
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-34]
సీ. |
దినవారరాశి మాపను మౌని గ్రోలంగ
నడుగునఁ గనుపట్టు నస లనంగఁ
గ్రుంకు[4]మెట్టడవిఁ [5]గార్కొనిన సంధ్యావహ్నిఁ
[6]బొడమిన దట్టంపుఁబొగ యనంగఁ
దన మణి పడిపోవ ధరణీతలంబున
నెమకంగ వచ్చిన నింగి యనఁగ
నల చుక్కలనియెడి వలరాజు గెలుపువ్రా
[7]ల్దెలియఁ [8]బూసిన మషీలేప మనఁగ
|
|
తే. |
[9]వృద్ధవారవిలాసినీవిసరమునకు
నపలితంకరణౌషధం బనఁగ జార
నలినముఖుల కదృశ్యాంజనం బనంగ
నంధకారంబు [10]జగమెల్ల నాక్రమించె.
| 165
|
ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [4-124]
[11]సీ. |
గగన[12]పల్వలసముత్కటమహాపంకంబు
నందుఁ ద్రుళ్ళెడు లులాయం బనంగ
రజనీవధూటి తారకహారశోభకై
[13]రమణఁ దాల్చిన నీలిరవికె యనఁగ
బ్రహ్మాండపటుకర్పరమున నర్కానలా
ర్చుల నుద్భవించు కజ్జల మనంగఁ
గాలధాత్రీధరాగ్రమునందు నిబిడమై
కనుపట్టు నీలమేఘం బనంగ
|
|
తే. |
నంధకాసురగర్వాపహరణకంఠ
ఘటితహాలహలప్రభ [14]గగనరేఖ
[15]బలిమి జగమంతయును [16]నింత బలసె ననఁగ
నంధకారంబు [17]జగమెల్ల నాక్రమించె.
| 166
|
- ↑ క.స్వ+oకణ, గ.పశ్వభుండన
- ↑ క.గ.గంధ
- ↑ క.గ.వృత్తి
- ↑ క.మేటడవి, గ.పెట్టెడివి
- ↑ గ.గాల్గొనిన
- ↑ గ.బొదవిన
- ↑ గ.దివియ
- ↑ క.బూనిన
- ↑ క.పెద్దవారి
- ↑ గ.దిశలెల్ల
- ↑ క-లో లేదు.
- ↑ గ.పల్లవ
- ↑ గ.రవణ
- ↑ గ.గర్వ
- ↑ గ.లలమి
- ↑ గ.నిండ
- ↑ గ.దిశలెల్ల