Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారలు

నందితిమ్మన – పారిజాతము [2-37]

సీ.

కార్కొన్న కటికచీఁకటిమొగు ల్మొత్తంబు
              గురిసిన వడగండ్లగుంపు లనఁగఁ
గవజక్కవలు వాయఁ గరనాళములఁ జందు
              రుం డూఁదు పటికంపుటుండ లనఁగ
నెల్లెడఁ జదలేటియిసుమున నచ్చర
              కొమ లిడ్డ వెన్నెలకుప్ప లనఁగ[1]
దెలివివెన్నెల వెండితీవెలు నిగిడించు
              చదలు కమ్మచ్చుబెజ్జము లనంగ


తే.

జగము గెల్వంగ దండెత్తు మగని మీఁద
లీల రతి చల్లు దీవనఁబ్రా లనంగ
వెండివెలుఁ గెండఁ గ్రాఁగిన విన్ను మేన
నెక్కొను చెమటబొట్లు నాఁ జుక్క లమరె.

93

శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-161]

సీ.

చుక్కలో యివి? గావు సురలోకవాహినీ
              విమలాంబుకణకదంబములు గాని
తారలో యివి? గావు తారాపథాంభోధి
              కమనీయపులిన[2]సంఘములు గాని
యుడువులో యివి? గావు మృడునంబరమ్మునఁ
              దాపించినట్టి ముత్యాలు గాని
రిక్కలో యివి? గావు రే[3]చామ తుఱుముపైఁ
              జెరివిన మల్లెక్రొవ్విరులు గాని


తే.

యనుచు లోకంబు సందేహ మందుచుండఁ
బొడిచె బ్రహ్మాండపేటికాపుటకుటీర
చారుకర్పూరఫాలికాసంచయములు
మెండుకొనియుండె నక్షత్రమండలములు.

94

బొడ్డపాటి పేరయ్య – శంకరవిజయము

సీ.

సంజప్రొద్దున నాట సలుపు నంబరకేశు
              తలయేటి జలకణతతు లనంగ
రజనీవధూద్విజరాజుల పెండ్లి కే

  1. క.“చలికొండయల్లుండు సంజకేళికవేళ - చల్లిన పువ్వుదోయి ళ్ళనంగ” అని మూఁడవపాదము తర్వాత అదనముగ కలదు.
  2. క.శంఖములు
  3. క.భామ