Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              ర్పఱుచు ముత్యపుఁదలఁబ్రా లనంగఁ
గాలవాణిజ్యుండు నీలాంబరస్థలి
              [1]నరిఁ బచరించు వజ్రము లనంగ
[2]వేళాఖ్యపుష్పలావిక యిందుఁడను రాజు
              నకు నేరిచిన ప్రసూనంబు లనఁగఁ


తే.

బాలవెల్లి మథించు తొల్కాలము [నను]
నమృతబిందువులు దరి మిన్నందె ననఁగ
గగనమను కొల నలమిన తొగ లనంగఁ
గలయఁ జుక్కలుఁ దోఁచె నాకాశవీథి.

95

తెనాలి రామలింగకవి – హరిలీలావిలాసము

ఉ.

కాలధనంజయుండు తనుఁ గాచి దివాకరమత్స్యయంత్రమున్
గీ లెడలించి సంధ్య యను కృష్ణ నుదంచిత[రూప]విభ్రమ
శ్రీలలితాంగినిం దగ వరించి తమోమయధార్తరాష్ట్రభూ
పాలకసేన నేయు సితభల్లములో యనఁ బర్వెఁ దారకల్.

96

[?]

తే.

ఉడుపథంబను ములుదోస తొడిమ యూడఁ
దామరసబంధుఁ డను పండు తనకుఁదానె
వికృతి గనుపింపఁ గనుపట్టు విత్తు లనఁగఁ
దనరె నెఱసంజఁ గెంపుగఁ దారకములు.

97

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-152]

ఉ.

నాలుగుదిక్కులందును ఘనంబుగఁ బర్విన చీఁకటుల్ జగ
ద్గోళము నిండ దృష్టికి నగోచరమై వెసఁ బర్వియుండఁగా
నీలపటంబుమీఁద విపణిం బచరించిన ముత్తియంబులన్
బోలి వెలింగె నంతట నభోనిలయంబునఁ దారకాతతుల్.

98

[3]పణిదపు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

చ.

నవకపుఁదెల్లమ్రగ్గు జతనంబునఁ గూర్చి వియద్గృహంబునన్
దివురుచు రంగవల్లికలు దేవగణంబులు చూచి మెచ్చఁగా
సవరఁగఁ దీర్చి కాలమను జక్కుల ముద్దుఁడు వేడ్కతో దివా
యవనికఁ చాయఁదట్టె నన నంచితలీల వెలింగెఁ [4]దారకల్.

99
  1. చ.న[రి]
  2. క.వేవాక
  3. ఫణిదపు
  4. చ.దామరల్