Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గోకిలరీతి నుందుననుకున్నను నంటివి కాక పాపపుం
గాకమ! నీకు నమ్మధురగానము గల్గునె యెన్ని పల్కినన్.

61

సూర్యాస్తమానము

తులసి బసవయ్య - సావిత్రికథ

సీ.

పటుచండతాండవోత్పతితధూర్జటిజటా
              మకుటాగ్రఫణిఫణామణి యనంగ
నికటవాతాఘాతనిర్భగ్నమగు పశ్చి
              మాచలధాతుశృంగాగ్ర మనఁగ
[1]సంధ్యాప్రభిన్నరక్షఃకోటిపై [2]వియ
              చ్చరణుఁ డేసిన సుదర్శన మనంగ
ఘననిశాంబుధిజగంబను కలం బెడలక
              యుండంగఁ ద్రోచిన గుం డనంగఁ


తే.

దేజమంతయు శిఖియందుఁ దిరము గొల్పి
కణఁకఁ దలలెత్తి పటుమాంస[3]కబళశంకఁ
బదరి జలచరపంక్తిపై పైఁబడంగఁ
బడియె నపరాంబురాశిలోఁ బద్మహితుఁడు.

62

జక్కన – సాహసాంకము [3-86]

సీ.

పశ్చిమాంభోనిధిప్రాంతదేశంబున
              రంజిల్లు విద్రుమకుంజ మనఁగఁ
జరమాద్రిశిఖరదేశంబునఁ గనుపట్టు
              కమనీయఘనరత్నకలశ మనఁగ
నపరదిక్కామిని యర్థితోఁ గనుగొను
              [4]పద్మరాగంపుదర్పణ మనంగఁ
బ్రత్యగ్దిశాకుంభిఫాలభాగమ్మునఁ
              బొలుపాఱు జేగురుబొ ట్టనంగ


తే.

భూరికాంతి నభోవనభూమిఁ బండి
కాలశుకతుండహతి [5]బిట్టు గదలి యపర
జలధిలోఁ బడు దాడిమఫల మనంగ
[6]నబ్జినీవరబాంధవుం డస్తమించె.

63
  1. క.సద్యోపభిన్నరక్షణ
  2. క.వియచ్చరణకెన్న
  3. చ.కలశ
  4. క.పద్మమాణిక్య
  5. క.బట్టు
  6. క.నంజినీ