Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలమరాజు - పర్వతపురాణము

చ.

అరయఁగ లోకబాంధవుఁడనై భువనత్రయకర్మసాక్షినై
హరిహరపద్మసంభవమయాకృతినై మను నాకు వారుణీ
పరిచయదోష మబ్బెనని భానుఁడు తద్దురితోపశాంతికై
శరనిధిఁ గ్రుంకెనా నపరశైలతిరోహితుఁ డయ్యె [1]నత్తఱిన్.

64

[2]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-67]

చ.

చరమధరాధరాగ్రమునఁ జాఱెఁడువేళఁ బతంగుఁ డంగజి
త్వరితమనస్కమై నిలిచి తన్ను గనుంగొను [3]సౌధశేఖరో
పరితరుణీజనంబుముఖపద్మముల న్వికసింపఁజేసె స
త్పురుషులు తారు దుర్దశలఁ బోవుచునైనను బ్రోతు రాశ్రితున్.

65

[మద్దికాయల మల్లయ్య] - రేవతీపరిణయము

మ.

కటకండూయన మంతనంతఁ జలుపంగాఁ దామ్రపర్ణీమదో
త్కటదానంబులు నిండి [4]జిడ్డుకొన కన్తగ్రావకూటద్యష
త్తటముల్ మెట్టఁగఁ [5]జిక్కుఁ బాఱె నవినీతంబుల్ వడిం బాఱె నా
[6]పుటలిన్యాపుండు ? గ్రుంకెఁ బశ్చిమమహాంభోరాశిపూరంబునన్.

66

తెనాలి రామలింగయ్య – హరిలీలావిలాసము

ఉ.

ఎంతయు రాజు[7]తోడఁ బగయే [8]కొమరో మధుపప్రసక్తి య
శ్రాంతము గల్గు తమ్ముల ప్రచారము గాదని [+ +] నోడి దే
శాంతర మేఁగె నాఁగ నపరాశఁ బతంగుఁడు దాఁగె నట్టి వృ
త్తాంత మెఱింగి సిగ్గొలసినట్టులు [9]గందె సరోరుహంబులున్.

67

[నంది తిమ్మన్న] పారిజాతము [4-45]

క.

ఘనసాంధ్యరాగవినతా
తనయగరుత్సమితి [10]కడిఁది తాఁకున ధర వ్రా
లిన గగనఫణిఫణామణి
యన రవిమండలము పశ్చిమాంబుధిఁ గ్రుంకెన్‌.

68

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర [4-124]

ఉ.

ఆ యెడఁ గాలకారకుఁ డహర్పతియున్ గనకంపుఁ బూదె వై
హాయసవీథియన్ గొలిమియందుల నెఱ్ఱఁగఁ గాఁచి నీటిలోఁ

  1. చ.నయ్యెడన్
  2. సుంకసాల
  3. క.సోమ
  4. క.జెడ్డు, చ.చెండు
  5. చ.జిర్కు
  6. చ.బుటకన్యాప్తుఁడు ?
  7. చ.తోడిపగయే
  8. క.కొమలో, చ.కొదవో
  9. క.గంటె
  10. క.కణింది