అవధానభారతి – మంచన – కేయూరబాహుచరిత్ర [3-31]
మ. |
అరయం దుష్టజనుల్ స్వదుశ్చరణజాత్యంధుల్ నిజాచారధీ
గరిమాదిస్తుతివాద్యు లాత్మధ[న]రక్షాజాగరూ[కే]క్షణుల్
పరదోషేక్షణదివ్యచక్షు లితరప్రజ్ఞాభిశంసానిరం
తరమౌనవ్రతు లన్యవిత్తహరణధ్యానక్రియానైష్ఠికుల్.
| 56
|
క. |
కెలనికి మేలును దనకుం
గలిగెడి నింద్రత్వమైనఁ గాదనుఁ దుది దాఁ
బొలిసిన మెలసి తలంచును
ఖలుఁ డొరులకుఁ గీడు సేయఁ గలిగినఁ జాలున్.
| 57
|
అన్యాపదేశములు
మ. |
అతిమాధుర్యమనోజ్ఞచూతఫల మాహారంబుగాఁ గల్గియున్
మతి గర్వింపక కోకిలంబు పలుకున్ మంజూక్తి జంబాలదూ
షితనీహారముఁ గ్రోలి భేక మఱచున్ జృంభించి యాకర్ణ[న]
స్థితిఁ గాఠిన్యము దోఁపఁగా బెకబెక [1]న్ఛీకాకులారావముల్.
| 58
|
ఉ. |
పీనసరోగి నిన్నుఁ దిలపిష్టసమానము [2]గాఁగఁ జూచినన్
వాని వివేకశూన్యతకు వందురనేల కురంగనాభమా!
మానవతీకపోలకుచ[3]మండలచిత్రితపత్రవల్లికా
నూన[4]విశేషసంపదల నొందుట లోకము ని న్నెఱుంగదే.
| 59
|
ఉ. |
ఏచి [5]తలిర్చి గొప్పలగు నెఱ్ఱనిపువ్వులతోడి బూరుగున్
రాచిలు కర్థిఁ జేరి మధురంపుఫలంబుల కాస సేసినన్
[6]గాచిన కాయలుం బగిలి గాలివశంబున దూదియై చనన్
జూచి నిరాశయై చనినఁజొ ప్పగు నీచుల నాశ్రయించినన్.
| 60
|
ఉ. |
ఈఁకలు నల్లనైనవని యెంచి విశాలరసాలశాఖ యు
త్సేకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్
|
|
- ↑ చ.స్ఫీతా
- ↑ చ.చేసినంతనే
- ↑ చ.మండితచిత్రపత్రికా
- ↑ చ.వితానవాసనల
- ↑ క.తలించి
- ↑ చ.నాల్గవపాదము మూఁడవపాదముగ కలదు. నాల్గవపాదము లేదు. చుక్కలు పెట్టఁబడినవి.