Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[2-88]

చ.

కరితురగాదిఘట్టనయు గాలియు నొంపదె యొంటియున్న య
త్తరువు ననేకభూరుహవితానము గుంపయి పేర్చి బాధలం
బొరయునె యన్నదమ్ములును బొందిన నేరి కసాధ్యు లట్లు గా
కెరవయి నిల్చినన్ గెలని కెల్లిదమై [1]పఱిపోదు రెంతయున్.

51

సుజనులు

[భారతము-] ఉద్యోగపర్వము [2-41]

క.

పురుషుండు రెండుదెఱఁగుల
ధర నుత్తముఁ డనఁగఁబరఁగుఁ దా నెయ్యడలన్
బరుషములు పలుకకునికియు
దురితంబులు దొరయు పనులు దొఱఁగుటవలనన్.

52

[2-42]

తే.

చెల్లియుండియు సైరణ సేయునతఁడుఁ
బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ
దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ బుణ్య
పురుషుఁ డని చెప్పి రార్యులు [2]గురువరేణ్య!

53

[2-59]

క.

విదిరికి నిజమును హితమును
మది కింపులు గాఁగఁ బల్కు మాటలు పెక్కై
యొదవినను లెస్స యటుగా
కిది యది యనకూరకునికి యెంతయు నొప్పున్.

54

కుజనులు

భారతము – ఉద్యోగపర్వము [2-58]

క.

ఒరుల ధనమునకు విద్యా
పరిణతికిం దేజమునకు బలమునకు మనం
బెరియ[గ] నసహ్య[పడు న]
న్నరుఁడు దెవులు లేని వేదనం బడు నధిపా!

55
  1. క.బడి
  2. క.పుర