Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

జనుఁగాని యాజ్ఞఁ బొత్తీఁ
జన దధిపతికిన్ వివేకచతురాననుఁడా.

⁠ 22

[25]

క.⁠

సకలవ్యసనికిఁ జుట్టము
నకు మంత్రికి నిష్టభృత్యునకు నజ్జకు నొ
జ్జకుఁ బోటుగాని కర్థా
ధికార మీఁ జనదు నయ[1]గతిని బద్దెనృపా!

⁠ 23

[41]

చ.⁠

నయమునఁగాని భూమి ప్రజ నమ్మదు నమ్మినఁగాని యర్థసం
చయమును దంత్రవృద్ధియును జాలదు చాలినఁగాని శత్రులన్
బయిచని యోర్వరాదు పరపక్ష మణంగినగాని భూమి య
క్షయముగ నేలరా దనిరి [2]కావ్యచతుర్ముఖ బద్దెభూపతీ!

⁠ 24

నన్నయభట్టు – సభాపర్వము [1-35]

క.⁠

[3]ఉపధాశుద్ధులఁ బాప
వ్యపగతబుద్ధుల వినీతి[4]వర్తుల[5]సములన్
సుపరీక్ష నియోగించితె
నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.

⁠ 25

తిక్కనసోమయాజి – ఉద్యోగపర్వము [2-37]

తే.⁠

ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
[6]యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు.

⁠ 26

నీతిసారము

సీ.⁠

బలుగాపు వాకిళ్ళఁ బగలు రేయును నిడి
              కోటఁ బాళెముఁ దగు[7]చోటఁ బెట్టి
[8]కనుపట్ల [9]నెల్లె[డ] గావలి నియమించి
              నడిమిచావఁడి దగు నరుల నునిచి
నగరిచుట్టును జాలె నడిపించి క్రంతలఁ

⁠
  1. ↑ క.మతికి
  2. ↑ క.కాదె
  3. ↑ క.ఉపగత
  4. ↑ క.వంతుల
  5. ↑ క.సమతన్
  6. ↑ క.యెనిమిటి
  7. ↑ క.కోట
  8. ↑ క.కనుమట్ల
  9. ↑ చ.నెల్ల