Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రౌఢకవి మల్లన [3-20]

క.

పతియు నమాత్యుఁడు దుర్గము
క్షితియును మిత్రుండు ధనము సేనయు ననఁగా
నుతి కెక్కిన సప్తాంగము
లతులితగతి రక్ష సేయనగు నరపతికిన్.

18

[3-30]

క.

పొదుగొత్తి [1]పిదికి క్రేపుల
మొద లార్చుట ప్రజల నధికముగ నరిఁ గొనుటల్
కదుపులఁ బెనుచుట [2]తగునది
యదనం గొని ప్రజలఁ బ్రోచు టవనీపతికిన్.

19

[3-77]

సీ.

వేఁటఁ బాండుక్షమావిభుఁడు శాపముఁ బొందె
              ద్యూతసంగతి నైషధుండు నలఁగె
పానంబుచే యాదవానీక మిలఁ గూలెఁ
              బరుషోక్తిఁ గౌరవప్రతతి సమసెఁ
గఠినదండమున మాగధుఁడు మేను దొఱంగె
              భామినీరతి సింహబలుఁడు గెడసెఁ
దగని యీఁగిఁ ద్రిశంకుధరణిపాలసుతుండు
              తలపోయరాని దుర్దశఁ జరించెఁ


తే.

గాన వ్యసనంబు లేడును గాని వనుట
యెఱిఁగి మనమున నందుపై నించుకైనఁ
దగు లొనర్పక నిలిచెనే ధరణియెల్ల
నేలు నిష్కంటకముగ భూమీశ్వరుండు.

20

బద్దెనీతి [నీతిశాస్త్రముక్తావళి] [51]

క.

నాయకవిరహితమును బహు
నాయకముఖ్యంబు బాలనాయకమును స్త్రీ
నాయకమునైనఁ జెడు నర
నాయకునకు నండ్రు కీర్తినారాయణుఁడా.

21

[13]

క.

అనుజులుఁ దనుజులు గురుజను
లనుఁగులు బంధులుఁ బ్రధానులని [సిరిఁ బొ]త్తీఁ

  1. చ.పితికి
  2. గ.తగసరి