Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              దిరుగుచుఁ దగఁ దలవరుల నునిచి
[1]దినచర్యఁ బాళెముల్ దృష్టిఁబెట్టుచు [2]కేలు
              దివియలు విడువక తిరుగఁజేసి


ఆ.

దొరలు రాజులందు నరయుచు భటులందు
భేద మొదవకుండ నాదరించి
యుచిత[3]వృత్తి గావకుండిన దుర్గంబు
నేలగలఁడె భూమి నింద్రుఁడైన.

27

పంచతంత్రి

శా.

నానాశాస్త్రవిశారదుండు నయనానందాంగుఁడున్ సత్కుల
స్థానశ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్శుద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడును నిశ్చింతుండునై యుండినన్
వానిన్ మానుగ రాజదూత యని చెప్పన్వచ్చు నుర్వీస్థలిన్.

28

[?]

సీ.

[4]ఒనరఁగ పాలంబు నుపహారసంధియు
              సంతానసంధియు [5]సంగతంబుఁ
జాల నుపన్యాససంధియుఁ [6][బ్రతికార
              సంధియు సం]యోగ సంధికమును
[7]పురుషాంతరాదృష్టపురుషనామకములు
              నాదిష్టకంబును నాత్మమిషము
[8]బంధురోపగ్రహసంధి పరిక్రియ
              సంధియును నుచ్ఛిన్నసంధికంబు


ఆ.

ననుపమపరదూషణాంచితస్కంధోప
నేయసంధు లనఁగ నిశ్చితముగ
షోడశప్రకారసునిశితసంధివి
ధాన మెఱుఁగవలయు [9]ధరణిపునకు.

29

[కామందకము]

క.

అరుణుడు కిరణంబుల సం
చరణంబుల [10]వాయు వెపుడు చరియించుగతిన్
జర జనులచేత నృపతియు
నురుగతి జగమెల్ల నెఱిగియుండఁగ వలయున్.

30
  1. చ.దిన[?]...
  2. క.రేలు, చ.కేల
  3. క.వృద్ధి
  4. క.ఒనరంగ కాలంబు, చ.ఒనరంగఁ గమలంబు
  5. క.చ.సంగడంబు
  6. క.+++++++యోగసందికమును, చ. ....యోగసంధికమును
  7. క.పూషాంతర, చ.పుష్పాంతర
  8. క.చ.బంధురోన
  9. క.ధరరిపునకు
  10. చ.వాయ కెపుడు