Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాలుజిహ్వాకరతలరేఖ [1]లెఱ్ఱన
              స్వరనాభిసత్త్వముల్ సద్గభీర


తే.

ములు సెమర్ప[వు] మృదువు లంఘ్రులు కరములు
కఠినములు శంఖచక్రాంకకలితములును
నైదురేఖలు చెలువొందు నలికతలము
లక్షణము లింత యొప్పునే యక్షయములు.

220

స్త్రీసాముద్రికము

చోడయ సాముద్రికము

క.

ఉదరంబు దర్దురోదర
సదృశంబై జఘన మతివిశాలం బయినన్
సుదతీరత్నంబున క
భ్యుదయంబుగ ధరణి యేలు పుత్త్రుఁడు పుట్టున్.

221


క.

కడు నిడుదయుఁ గడు గుఱుచయుఁ
గడు వలుదయుఁ గడుఁ గృశంబుఁ గడు నల్లనిదిన్
గడు నెఱ్ఱనిదగు మెయిగల
పడఁతిని గీ డనిరి మునులు వరమునిచరితా.

222

కూచిరాజు ఎఱ్ఱయ్య – కొక్కోకము

సీ.

హేమవర్ణంబైన యిందీవరద్యుతి
              యైనను దనుకాంతి [2]యందమైనఁ
జరణంబులును హస్తసరసిజంబులు గోళ్లుఁ
              గనుఁగొనలును నెఱ్ఱ [3]గలిగియున్న
[4]సరసంబు మృదువునై చక్రాబ్జకలశచిహ్ని
              తంబైన కరపాదతలయుగములు
సమము బింకములైన చనుదోయి నల్లనై
              కడలొక్క కొలఁదైన కచభరంబు


తే.

భోజనము నిద్రయును గొంచెమును మొగంబు
నుదరమును జాలఁబలుచనై మృదులతనువు
నధికశీలంబుఁ గల కన్య యర్హనాఁగఁ
జాటి చెప్పిరి పరిణయశాస్త్రవిదులు.

223


సీ.

పర్వతతరునదీపక్షినామంబుల
              నే కన్నెఁ బిలిచెద రింటివారు?

  1. క.తీరన
  2. చ.బూనవలయు
  3. చ.గలుగవలయు
  4. చ.సరముల్ మృదువులై చక్రాబ్జము ల్చిహ్నకములైన వరపాదకరయుగములు