జయతరాజు ముమ్మయ విష్ణుకథానిధానము
ఉ. |
కాటుక చేతులున్ మొగముగాఁ బులుమాడుచుఁ దల్పవస్త్రముల్
చీటికి మాటికిన్ బొదలి చిందఱ వందఱ చేసి యాడుచున్
మీట నదల్ప నేడ్చుచును మెత్తని మాటల బుజ్జగించి ము
ద్దాటకుఁ జొచ్చినన్ నగుచు న ట్లమరెన్ హరి శైశవంబునన్.
| 217
|
చ. |
అరుణజటాచయంబును దిగంబరభావము సాంద్రధూళిదూ
సరితశరీరమున్ వెఱపు చంద మెఱుంగమి యెల్లచోటులున్
దిరుగుచు నున్కియున్ గలిగి తెల్లమి చేసె యశోదపట్టి దా
హరిహరు లేకమౌటఁ దనయం దతిశైశవవిభ్రమంబునన్.
| 218
|
పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [4-66]
సీ. |
సింహాసనంబునఁ జేరి రాజులు గొల్వ
నుండుచందమునఁ గూర్చుండనేర్చె
ధర్మంబు నాల్గుపాదములను నడపింతు
ననువిధంబున నడయాడనేర్చె
తరలునో యనృతంబు తఱుచుమాటల నను
పగిది నొక్కొకపల్కుఁ బల్కనేర్చె
వర్ణాశ్రమంబుల వరుస దప్పకయుండ
నిలుపుదు ననుభంగి నిలువనేర్చె
|
|
తే. |
ధాత్రి కరమందు నంశ [1]మైదవది తనకు
నర్హ మను పోల్కి ధాత్రి కరాంగుళంబు
కణఁకఁబట్టి యల్లల్లన నడువనేర్చె
నాఁడు నాఁటికి నిభపురనాథసుతుఁడు.
| 219
|
పురుషసాముద్రికము
కవిలోకబ్రహ్మ - -కేదారఖండము
సీ. |
కక్షకటిస్కంధకుక్షిఫాలాస్యంబు
లాఱు నున్నతము లీ యర్భకునకు
నాజానుబాహునాసాక్షులు దీర్ఘముల్
హ్రస్వంబు [2]లూరుమేహనగళంబు
లంగుళిజత్రుకేశాంఘ్రిగుల్ఫములు సూ
క్ష్మము [3]లధరోష్టనఖదృగంత
|
|
- ↑ క.గ.మైదువది
- ↑ చ.పృష్ఠ
- ↑ చ.అగ్ర