Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పొడవు కొంచెము దళంబును స్వల్పమును వక్త్ర
              మునఁ బొందు నే కన్య తనువు తొడలు?
బింబోష్ఠ మధికంబు పింగళమై గుంట
              కన్నులు గల్గి యే కన్నె మెలఁగుఁ?
గలకంఠమును బాదకమలంబులునుఁ గడుఁ
              గఠినంబు లగుచు యే కన్నె కుండు?


తే.

నిదురవోవుచు నవ్వుచు నిడుదయూర్పు
వుచ్చు నేడుచు నే కన్య భుక్తివేళ
మీసములు గల్గి చనుదోయిమీఁద రోమ
ములును [1]గల్గును నా కన్యఁ దలఁప వలదు.

224

పురుషయౌవనము

[2]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-58]

సీ.

తూఱి బాల్యము వోవఁ ద్రోచి ప్రాయంబు వె
              ట్టిన కవాటంబుఁ బాటించె నురము
జయరమాలంబనశాఖలై బాహువు
              లాజానుదైర్ఘ్యంబు నధిగమించె
వదనచంద్రునిఁ [3]జొచ్చి బ్రతికెడి చీఁకట్ల
              గతి నవశ్మశ్రురేఖలు జనించె
నర్ధిదైన్యములపై నడరు [4]కెంపును బోలె
              నీక్షణాంచలముల [5]నెఱ్ఱ దోఁచె


ఆ.

సుందరత్వమునకు జోటిచ్చి తా సంకు
చించె ననఁగఁ గడు గృశించె నడుము
జనవరాత్మజునకు సకలలోకోత్సవా
పాదియైన యౌవనోదయమున.

225

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [2-8]

సీ.

ధర నొక్కమైఁ దాల్పఁ దరము గాదని భోగి
              వరుఁడు దాల్చిన తనుద్వయ మనంగ
హృదయగేహముఁ బాసి యీశుఁ డేఁగకయుండ
              నలవరించిన [బోరు]దలు పనంగ
సముదీర్ణలావణ్యజలధిలోఁ జూపట్టు
              లాలితశైవాలలత యనంగ

  1. క.నేకన్య
  2. సుంకె
  3. క.జూచి
  4. క.కన్పును
  5. క.నెట్ట