|
క్కునఁ బేరుల్ విరులై పెనంగొన బెడంగున్ జూపు లాడింపుచున్
జననాథాగ్రణి కంటె నొక్కతె తలన్ సంపెంగతైలంబుతోన్.
| 147
|
సీ. |
కీలుఁగం పెడలింపఁ గేదంగిపూఁదావి
పుంభావ[1]వాంఛలు గుబులుకొనఁగఁ
నఱచెయ్యి నడువెత్తి నాడింప బహువిధ
గంధ[2]కదంబముల్ [3]గజిబిజింపఁ
బదనిచ్చి నుదురొత్తఁ బచ్చికస్తురిబొట్టు
బిగివిడి తొడలపైఁ బెట్లి వ్రాలఁ
గేసరి గోళ్ళను గెరలిన జవ్వాది
తట్టుపున్గులచేతఁ దావు లెసఁగ
|
|
తే. |
నాతి చన్నులపొంగున నడుము వణఁక
నధివు వాతెర తెల్లనా కందుకొనుచుఁ
బసిఁడిగిన్నియలోని సంపంగినూనె
వనిత తలయంటె తనప్రాణవల్లభునకు.
| 148
|
ముక్కు తిమ్మయ – పారిజాతము [2-10]
ఉ. |
తామరదోయిలోఁ దగిలి దాఁటెడు తేఁటులఁ బోలఁ బెన్నెఱుల్
వేమఱు చేతులం [4]బిడిచి విప్పి విదిర్చి నఖాంకురంబులన్
గోమలలీల దువ్వి తెలిగొజ్జఁగినీ రెడఁజల్లి చల్లి గం
ధామలకంబు వెట్టె నొకయంగన కాళియనాగభేదికిన్.
| 149
|
చరికొండ ధర్మయ – చిత్రభారతము [4-5]
చ. |
ఒకచపలాక్షి యొయ్యన నృపోత్తము నౌదలపైఁ దనర్చు నా
చికురభరంబు పాపిటలు సేసి మనోహరచందనంపుటం
టకలి యిడెం గరంబులు దడంబడ రాచుచు రత్నకంకణ
ప్రకరముఁ గుండలంబులును రాపడి మ్రోయఁగఁ దూఁగియాడఁగన్.
| 150
|
ముక్కు తిమ్మయ – పారిజాతము [2-11]
మ. |
చెలువల్ గొందఱు హేమకుంభములతోఁ జేసే నొసంగన్ విని
ర్మలదోర్మూలరుచుల్ వెలిం [5]బొలియఁ దోరంబైన చన్దోయి సం
దొలయ న్వేనలి జాఱ నిక్కి యరమే నొయ్యారమై వ్రాలఁగా
జలకం బార్చె లతాంగి యోర్తు యదువంశస్వామికి న్వేడుకన్.
| 151
|
- ↑ క.తలపులు
- ↑ క.కదంబంబు
- ↑ క.కచభజింప
- ↑ క.విడిచి
- ↑ క.బొరయ