Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు – కాశీఖండము [2-73]

మ.

పసుపుంగుంకుమకజ్జలంబులును గూర్పాసంబు తాంబూలమున్
గుసుమంబుల్ గబరీభరంబు చెవియాకుల్ మంగళాలంకృతుల్
విసు పొక్కింతయు లేక తాల్పవలయున్ వీనిన్ సదాకాలమున్
ససిఁ జక్కంగఁ బ్రియుండు వర్ధిలుటకై నాళీకపత్రాక్షికిన్.

143

పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [4-81]

చ.

తెఱవకు వల్లభుండు పరదేశము వోయిన వన్నె మాని తా
నఱితికి నల్లఁబూసలును నచ్చత బొట్టును మట్టి వన్నెగా
గుఱుమణుగైన పుట్టమును గూడఁగ దువ్వని మైలకొప్పునై
మఱువడి యింటిలోఁ బతిసమాగమనంబు మతింపుటొప్పగున్.

144

ఘటకాశి మల్లుభట్టు - జలపాలిమాహత్మ్యము

సీ.

అత్రిమునీశ్వరుం డడవి కేఁగినవేళ
              హరిహరబ్రహ్మలు ధరకు వచ్చి
యనసూయవర్తనం బరయఁ దలంచి వా
              రతిథులై యాహార మడిగినంత
నవుగాక యని వేగ యన్నపానాదులు
              వడ్డింపఁదలఁచుచో వారి కోర్కె
తప్పకుండఁ బతివ్రతాప్రభావంబున
              నకళంక యగుచు బాలకులఁ జేసి


తే.

యంబరము లూడ్చి సకలపదార్థములను
పాత్రములఁ బెట్టి తొంటి రూపము లొనర్చి
సంతతం బంది తత్తదంశముల సుతుల
వరము లందెను నది పతివ్రతల మహిమ.

145

అభ్యంగనము

ముక్కు తిమ్మయ్య – పారిజాతము [2-9]

ఉ.

కంపనలీలమై నసదుఁగౌ నసియాడఁ గుచద్వయంబు న
ర్తింప లలాటరేఖ చెమరింపఁగ హారలతాగుళుచ్ఛముల్‌
తుంపెసలాడఁ గంకణమృదుధ్వని తాళగతిం జెలంగఁగా
సంపెఁగనూనె యంటె నొకచంద్రనిభానన కంసవైరికిన్‌.

146

చరిగొండ ధర్మయ్య [4-4]

మ.

కొనగోరుల్ దలసోఁకఁ జన్నులమెఱుంగుల్ దిక్కులం [1]బర్వ న
ల్లన వేఁ గౌను వడంకఁ గంకణము లుల్లాసంబుగా మ్రోయ న

  1. క.జెంద