చరికొండ ధర్మయ – చిత్రభారతము [4-6]
ఉ. |
కొందరు కామినీమణులు గొజ్జఁగినీరు సువర్ణకుంభరా
జిం దగముంచి చేరి యభిషేకము చేసిరి మోము లప్పుడం
దందఁ జెమర్పఁ జన్ను లొరయం గరమూలరుచుల్ దిశావళిన్
[1]జిందఁగ వింతసంభ్రమముచేఁ బదనూపురకోటి మ్రోయగన్.
| 152
|
సూపకారుని వర్ణన
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
పులు [2]సొఱ్ఱ చేఁదు నుప్పును దీపు నొగరును
గణుతింపఁ బానాధికములు గాక
చిముడంగఁ బాఱక చిక్కనై యిగురక
కాటువోవక మఱి కలఁతవడక
యుడికియు నుడుకకయుండి [3]నీ ర్కర్క్రమ్మక
పసరు వేయక పరిపాటి చెడక
సంబారములతోడి సంబంధ మెడలక
[4]పొగపువాసన [5]విరి వోటు గాక
|
|
తే. |
వింతలై జిహ్వకును రుచుల్ విస్తరిల్లఁ
దగు పదార్థంబు వెడనెడఁ దాము తామ
భోక్తలకు భోజనాసక్తిఁ బొడమఁ జేయ
నిండువేడుకఁ గూరలు వండనేర్తు.
| 153
|
తిక్కన సోమయాజి – విరాటపర్వము [1-77]
ఉ. |
ఆఱురసంబులం జవులయందలి క్రొత్తలు వుట్ట నిచ్చలున్
వేఱొకభంగిఁ బాకములు విన్ననువొప్పఁగఁ జేసి చేసినన్
మీఱఁగ బానసీని నొకనిం బురిఁ గాననియట్లుగాఁగ మే
న్గాఱియవెట్టియైన నొడికంబుగ వండుదు నన్నికూరలున్.
| 154
|
విషనిర్విషాలకు
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
తంగేడు [6]జెముడుకుఁ దామ రుమ్మెత్తకు
గన్నేరువేళ్ళకుఁ గరకకాయ
|
|
- ↑ క.జెందగ
- ↑ క.సోర
- ↑ చ.నిక్కమ్మక (?)
- ↑ చ.పొగువు
- ↑ చ.విరిపోటు
- ↑ క.చెమడకు