Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాత్రము గాఁగ నంచుఁ దగుభంగిఁ బికంబులఁ దేంట్లఁ జిల్కలన్
బత్రము పుష్పముల్ ఫల ముపాయన మిచ్చి భజించి నెచ్చెలుల్.

115

[పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని] శాకుంతలము [3-188]

మ.

జననం బొందితి దుగ్ధవారినిధి నాసర్వేశుజూటంబుపై
జనుచే ప్రొద్దుఁ బ్రశంస సేయ నవతంసం బైతి నీప్రాభవం
బునకుం బాంథజనాపకారి యగు నాపూవిల్తునిం గూడి వా
రని దుష్కీర్తిగఁ దిట్టునం బడకు చంద్రా! రోహిణీవల్లభా!

116

శ్రీనాథుఁడు – నైషధము [2-129]

మ.

అవతంసంబవు పార్వతీపతికి దుగ్ధాంభోధికిం గూర్మిప
ట్టివి బృందారకధేనుకల్పతరువాటికౌస్తుభశ్రీసుధా
సవదిగ్వారణసోదరుండవు జగచ్ఛ్లాఘ్యుండ వీ విట్టినీ
కవునే [1]ధర్మువు శోచ్యపాంథజనసంహారంబు తారాధిపా.

117

తులసి బసవయ్య – సావిత్రికథ

చ.

పనివడి పాకశాసను నెపంబునఁ బంకజసంభవుండు నీ
తనువుఁ దొఱంగఁజేసె నతిదారుణశాంభవరోషవహ్నిచే
మనమున నాటి యాగ్రహము మానక నీవును సంఘటించి తా
ఘనుని శిరంబుఁ ద్రుంచు తమకం బితరుల్ [తెలి]యంగ [2]శక్తులే.

118

వేములవాడ భీమన

ఉ.

శ్రీలలనాతనూభవవిశేషజగజ్జయమూలమన్మథా
జ్ఞాలతికాలవాలరతినాథకరాళమదాంధగంధశుం
డాలవిలోలబాహువిలుఠత్కరవాలవిశాలమందవా
తూలమదీయకాంతధృతి తూలఁగ నేఁపున వీవకుండుమీ.

119

భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర

సీ.

కుసుమకోదండుండు గుణవంతుఁ డగుటెల్ల
              యళులార! మీప్రాపు కలిమిఁ గాదె
మరుని యెక్కుడు పెంపు మహిమీఁదఁ జెప్పుట
              కీరంబులార! మీపేరఁ గాదె
సంకల్పజన్ముండు సత్ప్రాణుఁ డగుటెల్ల
              మలయానిలంబ! నీమహిమఁ గాదె

  1. క.ధర్మము
  2. చ.నేర్తురే