Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మీనకేతనుకీర్తి మిన్నందు కొనుటెల్ల
              శీతమయూఖ! నీచెలిమిఁ గాదె


తే.

బాలఁ గారింపఁ దగదని పలుకఁ దగదె
యేడుగడయును మీరె [1]కా కెంత దవ్వు
మాకుఁ బుష్పాస్త్రుఁ డంచు ననేక[2]నుతుల
మధుపశుకమందపవమానవిధులఁ దలఁచి.

120

దూషణలు

[?]

సీ.

ధూర్జటికోపాగ్ని ధూళిగాఁ గ్రాఁగిన
              నాఁ డేల నీయమ్ము వాఁడి లేదు
వాఁడికోఱల రాహు వడిఁదోలి కఱచిన
              నాఁ డేల నీరశ్మి వేఁడి లేదు
శాపంబు శ్రీరామభూపాలుఁ డిచ్చిన
              నాఁ డేల కూయరో పోఁడిగాను
చనుపకముల కర్గి కనుకని డుల్లిన
              నాఁ డేల మ్రోయరో నేఁడు మీరు


ఆ.

మగువఁ బాయు టెఱిఁగి మగఁటిమి వాటించి
యేయఁ గాయఁ గూయ మ్రోయ నగునె?
మదన! చంద్ర! పికమ! కొదమతుమ్మెదలార!
నాఁడు నాఁడు నాఁడు నాఁడు లేరె?

121

[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము

ఉ.

పైకొని వచ్చె దేల నినుఁ బాము దినం జలిగాలి! ప్రార్ధనల్
గైకొన వేల చంద్ర! నిను గా మడువన్ మెలఁ పేది ప్రేలెదో
కోకిల యేటి కిట్లు? నినుఁ [4]గొర్త బడం దరళాక్షి సేయు నీ
పాకము దప్పవేల నిను భస్మముగా వలరాజ యిత్తఱిన్.

122

నెల్లూరి ముత్తరాజు - పద్మావతీకల్యాణము

క.

నీ వెంత వేడుకొన్నను
గేవలపాతకుల కేల కృప పుట్టదు మదిన్
[5]దేవుఁడు నహి గురువు న్నహి
భావజచంద్రులకు వికచపద్మదళాక్షీ.

123
  1. చ.కాలెంత ద్రవ్వు
  2. చ.గతుల
  3. సుంకసాల
  4. క.గొత్త
  5. క.దేవున్నహి