Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థనలు

[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము (3-117)

సీ.

నీవిక్రమక్రీడ నిజహృదయంగమం
              బై మెచ్చు శ్రీధరుం డనుఁగుఁదండ్రి
నీయాజ్ఞ నొండన నేరక ముద్రిత
              వదనుఁడై వర్తించు వాగ్వరుండు
నీతూపు కోర్వక నిటలాక్షుఁ డుమతనూ
              ఫలకంబు చాటునఁ బాయఁ డెపుడు
నీబిరుదోక్తిచిహ్నితజయజంగమ
              స్తంభమై యున్నాఁడు జంభవైరి


తే.

యింకఁ దక్కిన బడుగుల నెన్ననేల?
యిట్టి నీ [2]వెట్లు పసిబాల నేఁచు టెట్లు
పర్వతం బెత్తు కెంగేల బంతి యెత్తి
కడిమి నెఱపంగఁ జూచితే కాయజన్మ.

113

[3-119]

సీ.

ముద్దియయెడ గల్గు మోమోట మఱచితే
              కాఱించె [3]దేల రాకాశశాంక
మగువ నీ కిచ్చిన మాటప ట్టెఱుఁగవే
              యించుక కృప సేయవేల చిలుక
కోమలాంగికి [4]నఱ్ఱు గుత్తికవై యుండి
              కలకంఠమా! కనికరము వలదె
చెలి మోముఁదమ్మి తావులఁ గ్రోలుచుండియుఁ
              గుడిచి నింటికిఁ గీడు గోరకు మఱి!


ఆ.

కాలమెల్లఁ బగలుగా వచ్చెఁ గదె మీరు
కొమ్మ నే(చఁదగదు) కోకయుగమ
యకట సతికి నంతరంగమై యుండియు
మలయకయ్య నీవు మలయపవన.

114

[3-121]

ఉ.

పత్రము పుష్పముల్ ఫలము భక్తి నొసంగెడివార మింతె యీ
మాత్రమునన్ బ్రసన్నులయి మానినిఁ గన్గొనుఁడయ్య మీకృపా

  1. సుంకసాల
  2. క.వెట్టు
  3. క.గల్గ
  4. క.నమ్మ