పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

ప్రపంచ చరిత్ర


మన కెట్లు తెలియునని అనుకొనుచున్నావేమో. ఆ కాలములో పుస్తకములుగాని, గ్రంథకర్తలుగాని లేరు కాబట్టి ఆ విషయములు వ్రాసిన గ్రంథము లుండవు. కాని ప్రకృతి వ్రాసిన గ్రంథమున్నదని నీవు మరచి పోలేదనుకొందును. తన కొండలమీదను, రాళ్ళమీదను ప్రకృతి తన చరిత్రను తన పద్ధతి ప్రకారము వ్రాయును. చదువదలచినవారందు చదువు వచ్చును. ఆది యొక విధమగు స్వీయచరిత్ర. హిమానీనదులు వాని యునికిని తెలుపుటకు కొన్ని గుర్తులను వదలును. ఒకమారు వానిని గుర్తించుట తెలిసికొన్నచో మన మెప్పుడును పొరపాటుపడము. ఈ గుర్తులను తెలిసికోగోరినచో హిమాలయములలోగాని, ఆల్ప్సుపర్వతములలోగాని, ఇతర ప్రదేశములందుగాని యిప్పుడున్న హిమానీనదులవద్దకు వెళ్ళవలేను. ఆల్ప్సులలోని బ్లాంకుశిఖరము చుట్టును ఉన్న హిమానీ నదులను నీవు చూచియుంటివిగదా. కాని అప్పుడీ గుర్తులు నీ కెవరును చూపలేదు కాబోలును. కాశ్మీరులోను, హిమాలయములం దితరభాగములలోసు చక్కని హిమానీనదులు పెక్కులున్నవి. మనకు మిక్కిలి దగ్గర నున్నది పిండారీ హిమానీనది. ఆల్మోరా కది వారము దినముల ప్రయాణములో నుండును. నేను చిన్నపిల్లవాడనుగా నున్నప్పుడు - ఇప్పుడు నీకంటే చిన్నగా నున్నప్పుడు అక్కడి కొకమారు పెళ్ళితిని. ఆ దృశ్య మింకను కన్నులకు కట్టినట్లున్నది.

చరిత్రను, గతకాలమును గురించి చెప్పుటకు బదులు హిమానీ నదులను, పిండారీని గురించి చెప్పుచున్నాను. నటనవల్ల వచ్చిన ఫలిత మది. నీవు నా యెదుట ఉన్నప్పుడు నీతో నేను మాటాడు విధముగా మాటాడుచున్నాను. అట్టి సందర్భములో మన మప్పుడప్పుడు హిమానీ నదులకో, ఇంకొక చోటికో షికార్లు పోవలేనుగదా,

హిమానీనదులను గురించి చర్చించుటకు కారణము నేను హిమ యుగము పేరేత్తితిని కాబట్టి. మధ్య యూరోపులోనికిని, ఇంగ్లాండులోనికిని హిమానీనదులు వచ్చిన వనుటకు కారణము వానిగుర్తు లాదేశములలో