పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడమటి ఆసియాలోని సామ్రాజ్యములు

51


మనము చూడవచ్చును కాబట్టి. ప్రాతకొండలపై నవి కానవచ్చును. అప్పుడు మధ్యయూరోపు, ఉత్తరయూరోపు మిక్కిలి శీతలముగా నుండెనని దీనినిబట్టి మన మూహించవచ్చును. తరువాత ఆ దేశములు వేడియగుటచే హిమానీనదులు క్రమముగా తగ్గిపోయినవి. భూగర్భ శాస్త్రజ్ఞులు - అనగా భూమిచరిత్రను పరిశోధించువారు ... శీతలయుగము పోయి ఉష్ణయుగము ప్రవేశించినదని చెప్పుదురు. అప్పుడు యూరోపు నేటి యూరోపుకన్న ఉష్ణముగా నుండెడిది. ఈ యుష్ణము కారణముగా యూరోపునం దంతటను అరణ్యములు దట్టముగా పెరిగెను.

ఆర్యులు తమ సంచారములో మధ్యయూరోపునకుకూడ వచ్చిరి. అక్కడ ఆ కాలమున వారు చెప్పుకోదగిన కార్య మేమియు చేసినట్లు లేదు. కావున వారిని ప్రస్తుత ముపేక్షింతము. నాగరీకులగు గ్రీకులును, మధ్యధరా ప్రాంత ప్రజలును మధ్య యూరోపు, ఉత్తరయూరోపులందు నివసించువారిని అనాగరికులుగా ఈసడించుచుండిరని తోచును. కాని యీ "అనాగరికులు" వారి అడపులలోను, గ్రామములలోను ఆరోగ్యముగా వీరులబ్రతుకు బ్రతుకుచుండిరి. దక్షిణముననున్న నాగరికజాతులపై వచ్చిపడి వారి ప్రభుత్వమును తలక్రిందులు చేయుటకు, అనుకొనకుండ, తయారగుచుండినారు కూడ. కాని ఇది ఎంతో కాలము తరువాతగాని జరుగలేదుకాబట్టి ముందుగా దానిని మనము తలచుకొన నవసరములేదు .

ఉత్తర యూరోపును గురించి కొద్దిగా మనకు తెలియునుగాని గొప్ప భూఖండములను గురించియు, కొన్ని దేశభాగములను గురించియు మన కసలే తెలియదు. కొలంబసు అమెరికాను కనుగొనె సని చెప్పుదురుకాని అంతకుముందు అక్కడ నాగరికత గల ప్రజలు లేరని కాదు. ఆ సంగతి ఇప్పుడిప్పుడు మనము తెలిసికొనుచున్నాము. ఏది యెట్లున్నను మనము ప్రసంగించుకొనుచున్న కాలమున అమెరికా యెట్లుండెడిదో మన కేమియు తెలియదు. ఈజిప్టు.. మధ్యధరాతీరము తప్ప మిగత ఆఫ్రికాఖండమునుగూర్చి మన కేమియు తెలియదు. ఈకాల