పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



8

పడమటి ఆసియాలోని సామ్రాజ్యములు

జనవరి 13, 1931

నిన్నను మమ్మందరిని చూచుట మంచిదయినది. కాని తాతను చూచునప్పుడు నా కెంతో విచారము కలిగినది. ఆయన నీరసముగాను, జబ్బుగాను ఉన్నట్లు కనిపించిరి. మరల పుష్టిగట్టి యథాస్థితికి వచ్చువరకు ఆయనను జాగ్రత్తగా కనిపెట్టి చూచుచుండుము. నిన్న నీతో సరిగా మాటాడలేకపోతిని. సమావేశ మంత కొద్ది కాలములో జరుగవలసి యున్నప్పు డెవరేమి చేయగలరు ? మనము కలవలేని సమావేశములకు, చెయ్యలేని ప్రసంగములకు బదులు ఈ ఉత్తరములను వ్రాయుచున్నాను. కాని ఇవి వానివంటివి కావుగదా ! ఈ నటన చిరకాలము నిలువజాలదు. కాని ఇట్టి నటనకూడ ఒక్కొక్కప్పుడు మంచిదే.

ఇక మనము ప్రాచీనులవద్దకు పోదము. ఇప్పటివరకు ప్రాచీన గ్రీకులవద్ద నుంటిమి. ఈ కాలమున ఇతర దేశము లెట్లున్నవి? యూరోపులో నున్న యితర దేశములను గురించి మనము తెలిసికోవలసినది ఆట్టేలేదు. వానిని గురించి తెలిసికోదగ్గ విషయము లున్నట్లు లేదు. ఉన్నను నాకు తెలియవు. ఉత్తర యూరోపు యొక్క శీతోష్ణస్థితి బహుశా మారుచు ఉండవచ్చును. ఇందువల్ల క్రొత్త పరిస్థితు లేర్పడియుండ వచ్చును. నీకు జ్ఞాపకమున్నదేమో - ఎన్నో సంవత్సరములకు పూర్వము ఉత్తర యూరోపును, ఉత్తర ఆసియాయును శీతలముగా నుండెడివి. ఈ కాలమునకు హిమయుగ మని పేరు. పెద్ద హిమానీనదులు మధ్య యూరోపువరకు ప్రవహించెడివి. ఆ కాలమున బహుశా మానవుడు లేడేమో. ఒక వేళ ఉన్నను మానవత్వముకన్న పశుత్వమే ఆతనిలో ఎక్కువగా నుండెను. ఆ కాలమున హిమానీనదు లున్నవని యిప్పుడు