పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

ప్రపంచ చరిత్ర


పెద్దమార్పు ఇండియాకు వచ్చినపిమ్మట, ఇండియా స్వాతంత్ర్యమును సాధించిన పిమ్మట మనము చేతులు కట్టుకొని కూర్చుండ వీలులేదు. ఈ లోకమున ప్రాణమున్న ప్రతిజీవియు మారుచునేయుండును. దినమునకు దినము, నిమిషమునకు నిమిషము ప్రకృతి సర్వమును మారును. ప్రాణము పోయిన జీవి మార్పుచెందదు. కదలక మెదలక పడియుండును. నదీ జలము ప్రవహించుచుండును. దాని నడ్డిన మురిగిపోవును. మానవుని జీవితముకూడ అంతే. జాతిజీవితము కూడ అంతే. మన కిష్టమున్నను లేకున్నను ముసలితనము వచ్చును. శిశువులు చిన్నపిల్ల లగుదురు. చిన్న పిల్లలు స్త్రీలగుదురు. స్త్రీలు ముదుసలు లగుదురు. ఈమార్పులను మనము సహించియుండవలసినదే. కాని ప్రపంచము మారునని ఒప్పుకొననివారు పలువురున్నారు. వారు తమమనస్సులను మూసికొని బీగము వేసికొందురు. నూతనాభిప్రాయములను వారు సమీపమునకు రానీయరు. స్వతంత్రముగా ఆలోచించుటకు వారు భయపడుదురు. కాని పర్యవసాన మేమి ? ఇట్టివా రున్నప్పటికిని ప్రపంచము కదలిపోవుచునేయున్నది. మారుచున్న పరిస్థితులలో ఇముడని యట్టివారును, వారివంటివారును ఉన్నారుకాబట్టి అప్పుడప్పుడు ఉత్పాతములు సంభవించుచున్నవి. పెద్ద విప్లవములు పుట్టుచున్నవి. నూటనలుబది సంవత్సరముల క్రితము రేగిన ఫ్రెంచి విప్లవము, పదమూడు సంవత్సరముల క్రితము రేగిన రష్యన్ విప్లవము అట్టివే. ఆ విధముగానే మనదేశమునందును నేడుమనము విప్లవముమధ్యనున్నాము. మనకు కావలసినది స్వాతంత్ర్యమే. కాని మనకు కావలసిన విషయము లింకను ఉన్నవి. మురుగుగుంటలను బాగుచేసి స్వచ్ఛజలము నంతటను ప్రవేశ పెట్టవలసియున్నది. మనము మన దేశమునుండి మాలిన్యమును, దారిద్ర్యమును, దుఃఖమును తుడిచివేయవలెను. మనము చేయబూనిన ఘనకార్యములను గురించి ఆలోచించి సహకారముచేయుటకు పలువురి మనస్సులు సమ్మతించుటలేదు. చేతనైనంతవరకు అట్టివారి మనస్సుల నంటియున్న బూజునుకూడ మనము తుడిచివేయవలెను. మనము చేయ