పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకిలాబ్ జిందబాద్

31


బూనినది గొప్ప పని. వెంటనే జరుగదు. కొంతకాలము పట్టునేమో! అయినా అథమపక్షము, దానిని కొంచెము ముందుకు నెట్టుదము-ఇంకిలాబ్ జిందబాద్!

మన విప్లవగేహాళిపై మన మిప్పుడు నిల్చియున్నాము. భావికాలమున నేమి జరుగనున్నదో చెప్పలేము. మన కష్టములకు మంచి ప్రతిఫలము వర్తమానమునందు సైతము మసకు ముట్టినది. హిందూదేశ స్త్రీలను పరికించుము. ఈ పోరాటమున వారెంత గంభీరముగా ముందంజ వేసికొనిపోవుచున్నారో ! శాంతముతో కూడిన ధైర్యము, స్థైర్యము - వారెట్లు ఇతరులకు మార్గదర్శకులై యున్నారో. ఇక ఘోషామాట-మన ధీరురాండ్రగు సౌందర్యవతులను మరుగుపరచిన ఘోషా, వారికిని, వారి దేశమునకును చేటు తెచ్చిన ఘోషా- అది ఇప్పుడు ఎక్కడ నున్నది ? ప్రాతకాలమునాటి వస్తువులను జాగ్రత్త పెట్టు వస్తుప్రదర్శనశాలల బీరువాలలో తలదాచుకొనుట కది చల్లగా జారుచున్నది కాదా ?

పిల్లలను - బాలబాలికలనుకూడ పరికించుము - ఆ వానర సేనలు, ఆ బాలసభలు, ఆ బాలికాసభలు. ఈ పిల్లల తల్లిదండ్రులు పెక్కురు వెనుక భీరువులవలెను, బానిసలవలెను ప్రవర్తించియుండవచ్చును. కాని మన తరమునందలి బాలబాలికలు బానిసత్వమును, భీరుత్వమును సహింప లేరనుమాట ఎవరు సందేహింప సాహసింతురు ?

ఈవిధముగా పరిపవర్తనచక్రము తిరుగుచుండును. క్రిందకువచ్చిన వారు పైకి పోవుదురు. పైకి వచ్చినవారు క్రిందికి పోపుదురు. మన దేశమున నాచక్రము ఇదివరలోనే తిరుగవలసినది. కాని ఈ మారు మనము దానిని గట్టిగా త్రిప్పి వదలితిమి. ఎవ్వరును దాని నాపలేరు.

ఇంకిలాబ్ జిందబాద్ !