పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

ఇంకిలాబ్ జింపబాద్*[1]

జనవరి 7, 1931

ప్రియదర్శినీ:- దృష్టికి ప్రియముగానుందువు నీవు. దృష్టిసాధ్యము కానప్పుడు ప్రియతమవు. నీకు వ్రాయుటకు నేడు నే నిచ్చట కూర్చుండగా దూరముననుండి వచ్చు మేఘగర్జనములవలె అస్పష్టధ్వనులు నాకు వినిపించెను. అవి యెట్టిధ్వనులో మొట్టమొదట నాకు అవగతము కాలేదు. కాని ఆ ధ్వనులు నాకు పరిచితముగా వినిపించుచున్నవి. నా హృదయమున ప్రతిధ్వనించి ప్రత్యుత్తరము పొందుచున్నవి. క్రమక్రమముగా ఆ ధ్వనులు సమీపించుచున్నట్లున్నవి. పెద్దవగుచున్నవి. త్వరలోనే వాని నిజస్వరూపము తెలియవచ్చినది. “ఇంకిలాబ్ జిందబాచ్” “ఇంకిలాబ్ జిందబాద్" అను వీరహుంకారములకు కారాగారము మారుమ్రోసెను. ఆ కేక విన్న మాహృదయములు సంతసించినవి. చెరసాలవెలుపల, మా కెంతో సమీపమందు మన రణదుందుభి మ్రోయించినవారెవరో నాకు తెలియదు. వారు నగరమునుండి వచ్చిన స్త్రీ పురుషులో ? పల్లెలనుండి వచ్చిన జానపదులో ? నేడు వారట్లు ఎట్టిసందర్భములో చేయుచున్నారో కారణ మూహింపలేను. వారెవరైననేమి? మా కుత్సాహము కల్పించిరి. వారి పరామర్శకు మేము మౌనముగా సమాధాన మిచ్చితిమి. ఆ సమాధానముతో మా యభినందనములును వెళ్ళినవి.

“ఇంకిలాబ్ జిందబాద్" అని మనమేల ఘోషింపవలెను? విప్లవమును, మార్పును మన మేల కోరవలెను ? నేడు ఇండియాలో గొప్ప మార్పు కలుగవలసియున్నమాట వాస్తవమే. కాని మన మందరము కోరు

  1. "ఇంకిలాబ్ జిందబాద్" అనగా “విప్లవము చిరకాలము జీవించుగాక" యని అర్థము.