పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

113


వడకుట, బట్టలునేయుట, శిల్పులు, నిరాటంకముగా సంచరించుట కధికార పత్రములు, జైళ్లు సైత మందు వర్ణింపబడినవి. ఈ పట్టికలో ఇంకను ఎన్నోవిషయములు చేర్చుకొనుచు పోగలనుకాని ఈ ఉత్తర మంతయు కౌటిల్య గ్రంథమందలి ప్రకరణ శీర్షికలతో నింపుట కిష్టము లేదు.

రాజుగా నుండుటకు ప్రజల యనుమతిని పొంది పట్టాభిషేక సమయమున, ప్రజాసేవ చేయుటకు సమ్మతించుచు రాజొక ప్రతిజ్ఞ తీసికోవలెను. ఆ ప్రతిజ్ఞ స్వరూప మిది - "నేను మిమ్ము హింసించిన నాకు స్వర్గము దూరమగుగాక. ప్రాణములు దేహమును వదలిపోవునుగాక. నాకు సంతానము లేకుండపోవుగాక." రాజు దినచర్య అందు వర్ణింపబడినది. జరూరుగా చేయవలసిన పని కాత డెప్పుడును సిద్దముగా నుండవలెను. ఎందుకనగా ప్రజాహితకార్యములు పాడై పోవుటకు వీలులేదు. రాజుగారి ఇష్టమునకై వేచియుండుటయును పనికిరాదు. "రాజు సమర్థుడైన ప్రజలను అంత సమర్థులగుదురు." "ప్రజల సౌఖ్యముపై అతని సౌఖ్యము ఆధారపడియుండును. వారి క్షేమమును కోరి, తన కిష్టమైన విషయములు మంచివి కావనియు, ప్రజల కిష్టమైన విషయములే మంచివనియు ఆత డెంచవలెను." మన ప్రపంచమునుండి రాజులు అదృశ్యులగుచున్నారు. నేడు కొద్దిమందిమాత్రమేమిగిలియున్నారు. వారుకూడ త్వరలో విష్క్రమింతురు. ప్రాచీన హిందూస్థానమున రాజరికమనగా ప్రజాసేవ యను విషయము గమనింపదగినది. రాజులకు భగవంతు డిచ్చిన హక్కులు లేవు. నిరంకుశాధికారము లేదు. రాజు దుర్మార్గుడైన, వానిని తొలగించి వేరొకనిని రాజుగా చేయ ప్రజలకు హక్కు కలదు. ఇది ఆకాలపు అభిప్రాయము. ఆకాలపు సిద్దాంతము. నిజమే. పలువురు రాజులు ఈ యాదర్శము నందలేక తమ యవివేకము కారణముగా దేశమును, ప్రజలను కష్టములపాలు చేసిరి.

"ఆర్యు డెన్నటికిని బానిస కాకూడదు" అన్న ప్రాతసిద్ధాంతమును కూడ అర్థశాస్త్రము నొక్కిచెప్పినది. ఆకాలములో పరదేశమునుండి