పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

ప్రపంచ చరిత్ర


తేబడినవారో, దేశములోనివారో ఒక విదమగు బానిస లుండియుందురు. ఆర్యుల విషయములో మాత్రము వారెన్నడును బానిసలు కాకుండ జాగ్రత్త తీసికొనుచుండిరి.

మౌర్యసామ్రాజ్య రాజధాని పాటలీపుత్రము. అది దివ్యమైన నగరము. గంగానది పొడవునను అది వ్యాపించియుండెను. గంగానదికిని, నగరమునకును మధ్య 9 మైళ్ల భూమి నగరము పొడవునను ఉండెను. దానికి సింహద్వారములు అరువది నాలుగు. చిన్నద్వారములు వందలకొద్ది ఉండెను. ఇండ్లు ముఖ్యముగా కలపతో నిర్మించుచుండిరి. అగ్నిభయ ముండునుగాన, ప్రమాదము సంభవించకుండ ముందు జాగ్రత్తలు ఎంతో శ్రద్ధతో తీసికొనిరి. ప్రధాన వీధులందు వేలకొద్ది పాత్రలనిండ నీరుపోసి యుంచెడివారు. అగ్నిప్రమాదము సంభవించినప్పుడు ఆర్పుటకై ప్రతి గృహయజమానియు నీళ్ళునింపిన పాత్రలను నిచ్చెనలను, కొక్కీలు మొదలైన అవసరమగు వస్తువులను సిద్ధముగా పెట్టుకొని యుండవలెను.

నగరముల నుద్దేశించి కౌటిల్యుడు వ్రాసిపెట్టిన నిబంధన యొకటి విన సొంపుగా నుండును. వీధులలో ఎవ్వరైనను మురికివేసిన వారికి జుల్మానా వేయుచుండిరి. వీధులలో నీరు నిలుచునట్లుగాగాని చాడి ప్రోగుపడునట్లుగాని చేయువారికి జరిమానా విధించుచుండిరి. ఈ నిబంధనలు ఆచరణలో పెట్టియుండినట్లయిన పాటలీపుత్రమును, మిగిలిన నగరములును చక్కగా, పరిశుభ్రముగా, ఆరోగ్యవంతముగా ఉండెడి వనియే చెప్పవలెను. మన పురపాలకసంఘము లిట్టి నిబంధనలు అమలు జరిపిన ఎంత బాగుండునో!

పాటలీపుత్రమునకు సొంత వ్యవహారములు దిద్దుకొనుటకై ఒక పురపాలక సంఘముండెను. ఇందలి సభ్యులను ప్రజ లెన్నుకొనుచుండిరి. సభ్యుల సంఖ్య ముప్పది. అందారు ప్రత్యేకసభలు (కమిటీలి) ఉండెను. ఒక్కొక్కదాని కయిదుగురు చొప్పున ఈ సభ్యు లందుండిరి. నగరమందలి పరిశ్రమలు, చేతిపనులు, బాటసారులకు తీర్థయాత్రీకులకు సదుపాయములు కల్పించుట, పన్నులు విధించుటకై జననమరణములకు