పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

ప్రపంచ చరిత్ర


సేనాని సెల్యూకసు, సైన్యముతో సింధునదినిదాటి ఇండియాపై దండయాత్ర చేసెను. తొందరపడి తాను చేసినపనికి అతడు వెంటనే పశ్చాత్తాపము నందెను. చంద్రగుప్తు డాతనిని పూర్తిగా ఓడించుటచే అతడు వచ్చినదారినేవెళ్ళెను. అతడేమియు సంపాదించలేదు సరిగదా, కాబూలు, హీరటువరకు నున్న గాంధారదేశమును అనగా నేటి ఆప్ఘనిస్థానమును చంద్రగుప్తుని వశము చేసెను. చంద్రగుప్తుడు సెల్యూకసు కుమార్తెను కూడ వివాహమాడెను. ఉత్తర హిందూస్థానమంతయును, ఆప్ఘనిస్థానములో కొంతభాగమును, కాబూలు మొదలు బెంగాలువరకును, అరేబియా సముద్రము మొదలు బంగాళాఖాతము వరకును అతని సామ్రాజ్యమిప్పుడు విస్తరించియుండెను. దక్షిణ హిందూస్థానము మాత్ర మాతని పరిపాలనలోలేదు. ఈ మహాసామ్రాజ్యమునకు రాజథాని పాటలీపుత్రము.

చంద్రగుప్తుని యాస్థానమున రాయబారిగా నుండుటకై సెల్యూకసు మెగాస్తనీసును పంపెను. మెగాస్తనీసు ఆకాలపు వృత్తాంతమును మనోహరముగా వ్రాసియుండెను. కాని అంతకన్న మనోహరమగు వేరొక వృత్తాంతము కలదు. చంద్రగుప్తుని పరిపాలనకు సంబంధించిన వివరము లందు కలవు. ఇది కౌటిల్యుని అర్థశాస్త్రము. కౌటిల్యుడే మన చాణుక్యుడు, లేదా విష్ణుగుప్తుడు. అర్థశాస్త్రమనగా "అర్థము (ధనము) నకు సంబంధించిన శాస్త్రము."

అర్థశాస్త్ర గ్రంథమున అనేకవిషయములు కలవు. వివిధ విషయములను అది చర్చుంచును. దానిని గురించి అధికముగా నీకు చెప్పుటకు సాధ్యముకాదు. రాజుధర్మములు, మంత్రుల ధర్మములు సభాసమావేశములు, ప్రభుత్వశాఖలు, వర్తకము, వాణిజ్యము, పట్టణపరిపాలనము, గ్రామపరిపాలనము, ధర్మశాస్త్రము, న్యాయవిచారణ స్థానములు, సాంఘికాచారములు, స్త్రీలహక్కులు, వృద్ధులను, అనాథులను పోషించుట, వివాహము, విడాకులు, పన్నులువేయుట, వసూలుచేయుట, భటసైన్యము, నౌకాసైన్యము, యుద్ధము, శాంతి, రాజనీతి, వ్యవసాయము, నూలు