పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకర్షింపబడుటకు యుక్తమైన అవకాశమిచ్చి పరిశీలన జరిపిన పిమ్మట ఉత్తరువు ద్వారా అట్టి సభ్యుని ఆ దళము నుండి బర్తరఫు చేయవచ్చును.

(2) దళము యొక్క ఏ సభ్యుడైనను ఆ దళములో కోనసాగుట వాంఛనీయము కాదని కంట్రోలరు అభిప్రాయపడు నెడల, అతడు అట్టి సభ్యుని దళము నుండి, ఏ కారణము తెలుపకుండ, సంక్షిప్తముగా బర్తరఫు చేయవచ్చును.

అపీలు

7. దళము నుండి 6వ పరిచ్ఛేదము క్రింద బర్తరపు చేయబడిన దళపు సభ్యుడు, అట్టి బర్తరపు తేదీ నుండి ముప్పది దినముల లోపల రాజ్య ప్రభుత్వమునకు అపీలు చేసికొనవచ్చును. మరియు కంట్రోలరు లేక ఇతర ప్రాధికారిచే చేయబడిన ఉత్తరువును ఆ ప్రభుత్వము, అట్టి అపీలుపై ఖాయపరచవచ్చును, మార్పు చేయవచ్చును లేక విపర్యస్త పరచవచ్చును .

పౌరరక్షణ దళపు సభ్యుల కృత్యములు.

8.(1) దళపు సభ్యులు, ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల ద్వారా లేక తత్సమయమున అమలునందుండు ఏదైన ఇతర శాసనము ద్వారా వారికి అప్పగించబడి పౌరరక్షణ చర్యలు తీసికొనుటకు సంబంధించిన కృత్యములను నిర్వర్తించవలెను .

(2) రాజ్య ప్రభుత్వము లేక కంట్రోలరు. ఉత్తరువు ద్వారా, దళము యొక్క ఎవరేని సభ్యుడిని, శిక్షణ కొరకు గాని, అట్టి ఉత్తరువులో నిర్దిష్టపరచబడు పౌరరక్షణ చర్యలు తీసికొనుటకు సంబంధించిన కృత్యములను నిర్వహించుట కొరకు గాని, పిలువచ్చును.

(3) ఈ విషయమున కేంద్ర ప్రభుత్వము చేయు ఉత్తరువులకు లోబడి, ఏదేని రాజ్యపు దళము యొక్క సభ్యుడెవర్నెనను, ఏదైన ఇతర రాజ్యములో పౌరరక్షణకు సంబంధించిన కృత్యములను నిర్వహించుటకు, ఎప్పుడైనను ఉత్తరువు ద్వారా కోరబడవచ్చును. మరియు అట్టి కృత్యములను నిర్వహించుచుండగా, ఆ ఇతర రాజ్యపు దళము యొక్క సభ్యుడుగా భావింపబడవలెను మరియు అతనియందు ఆ ఇతర రాజ్యపు దళము యొక్క సభ్యునికి గల అధికారములు, కృత్యములు, మరియు విశేషాధికారములు నిహితమై యుండవలెను మరియు ఆ దళపు సభ్యుని బాధ్యతకు లోనై యుండవలెను.

వినియమములు చేయు అధికారము,

9. (1) కేంద్ర ప్రభుత్వము అధిసూచన ద్వారా ఈ అధ్యాయము యొక్క వినియమములు ప్రయోజనములను నెరవేర్చుటకు వినియమములు చేయవచ్చును.

(2) ప్రత్యేకించి, మరియు పైన చెప్పబడిన అధికారము యొక్క వ్యాపకతకు భంగము కలుగకుండ అట్టి వినియమములు: --

(ఎ) దళపు సభ్యుల కృత్యములను విహితపరచవచ్చును మరియు వారు ఏ రీతి సేవకై పిలువబడవచ్చునో ఆ రీతిని క్రమబద్దము చేయవచ్చును;

(బి) ఏదైన దళము యొక్క లేక అన్ని దళముల యొక్క సభ్యుల వ్యవస్థను, నియామకమును, సేవా షరతులను, క్రమశిక్షణను, సాధన సామగ్రిని, మరియు దుస్తులను క్రమ బద్దము చేయవచ్చును ;