పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(3) ఉపపరిచ్ఛేదము (1) కింద చేయబడిన ఏదైన నియమములో ఆ నియమమును లేక దాని క్రింద చేయబడిన ఏదైన ఉత్తరువు యొక్క ఉల్లంఘనకు అయిదు వందల రూపాయల వరకు జుర్మానాతోను, ఆ ఉల్లంఘన కొనసాగుచున్నదైన యెడల, మొదటి జుర్మానా తరువాత అట్ట్టి ఉల్లంఘన కొనసాగు కాలావధిలో ప్రతి దినమునకు ఏబది రూపాయల వరకు అదనపు జుర్మానాతోను, శిక్షింపదగి యుండునని నిబంధన చేయవచ్చును.

అధ్యాయము- 3

పౌరరక్షణ దళము

పౌర రక్షణ దళమును ఏర్పాటు చేయుట -

4. (1) రాజ్య ప్రభుత్వము, రాజ్యములోపలి ఏ ప్రాంతము కొరకైనను (ఇందు ఇటు తరువాత "దళము" అని నిర్దేశించబడిన) పౌరరక్షణ దళము అనబడు వ్యక్తుల నికాయము నొకదానిని ఏర్పాటు చేయవచ్చును. మరియు (ఇతను కంట్రోలరు అనబడును) తన అభిప్రాయములో జిల్లా మేజిస్ట్రేటు కంటే తక్కువ కానట్టి హోదాగల ఎవరేని వ్యక్తిని అట్టి దళముపై ఆజ్జలు ఇచ్చుటకు నియమించవచ్చును:

అయితే, ఏదేని రాజ్యము యొక్క ఏ ప్రాంతములోనైనను, ఆ ప్రాంతములో ఈ చట్టము ప్రారంభమగుటకు అవ్యవహితపూర్వము, దళము యొక్క కృత్యములను దానికప్పగించవచ్చునని రాజ్య ప్రభుత్వము అభిప్రాయపడునట్టి ఏదైన వ్యవస్థ ఉన్నచో, ఆ ప్రాంతమునకు వేరుగా ఒక దళమును ఏర్పాటు చేయుటకు బదులు, ఆ ప్రాంతములో దళము యొక్క కృత్యములను చేపట్టవలసినదిగా లేక నిర్వహించ వలసినదిగా రాజ్యప్రభుత్వము ఆ వ్యవస్థను కోరవచ్చును, మరియు అటుపై ఆ వ్యవస్థ, ఈ చట్టము యొక్క ప్రయోజనములకు ఆ ప్రాంతపు దళముగా భావింపబడవలెను.

(2) రాజ్యములోపల కంట్రోలర్ల కార్యకలాపములను సమన్వయ పరచుటకు రాజ్య ప్రభుత్వము, ఒక పౌరరక్షణ డెరెక్తరును నియమించవచ్చును మరియు ప్రతి కంట్రోలరు, అట్టి డెరెక్టరుచే ఈయబడిన ఆదేశములను పాటించవలెను.

సభ్యులు మరియు అధికారుల నియామకము.

5. (1) రాజ్య ప్రభుత్వము, దళము సభ్యులుగా పనిచేయుటకు యోగ్యులై యుండి అందుకు ఇష్టపడు వ్యక్తులను అట్టి సభ్యులుగా నియమించవచ్చును, మరియు కంట్రోలరు అట్లు నియమించబడిన ఏ సభ్యుడినై నను తన అభిప్రాయములో ఆ సభ్యుడు ఏ పదవిని లేక కమాండ్ను చేపట్టుటకు యోగ్యుడై యుండునో ఆ పదవికి లేక కమాండ్ నకు నియమించవచ్చును .

(2) దళపు సభ్యుడుగా నియమించబడిన ప్రతి వ్యక్తికి, విహితపరచిన ప్రరూపములో ఒక సభ్యత్వ ధ్రువపత్రమును ఈయవలెను.

పౌర రక్షణ దళపు సభ్యుల బర్తరపు.

6. (1) కంట్రోలరు అభిప్రాయములో దళము యొక్క ఏ సభ్యుడినను అట్టి సభ్యుడిగా అతని కరవ్యములను తృప్తికరముగా నిర్వహించనిచో లేక నిర్వహించుటలో విఫలుడైనచో లేక అట్టి సభ్యుడిగా అతని కర్తవ్య నిర్వహణలో ఏదైన, చెడు నడవడికి దోషియైనట్లు లేక దోషియై యుండినట్లు కనుగొనబడినచో, కంట్రోలరు, అట్టి దళపు సభ్యునిపై గల ఆరోపణల విషయమున అతని విన్నపము