పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

చిహ్నములను లేక వాటిని పోలియున్న వేటిని మోసగించునట్లు లేక పౌరరక్షణకు భంగములో మనకు ఉపయోగించకుండా నివారించుట లేక నియత్రించుట;

(ఎస్) జరుగగలదని భావించిన ఏదైన శత్రుదాడి యున్న నుండి జనసామాన్యమును లేక జనసామాన్య సభ్యులను రక్షించుట లేదా ఆ అపాయములను వారికి తెలియజేయు దృష్టితో వ్యక్తులచే లేక కారులు తీసికొనబడవలసిన ముందు జాగ్రత్తలు లేక చర్య:

(టి) అగ్ని ప్రమాదమును కనుగొనుటకు, నివారించుటకు ఆవశ్యకమగు నట్టి ఏర్పాటు చేయవలసినదిగా లేక అట్టి ఏర్పాట్లను పూర్తి చేయవలసినదిగా ఏదేని భవనము, కట్టడము , లేక భవన క్షేత్రాదుల యజమానిని లేక ఆక్రమణను కలిగియున్న వ్యక్తిని కోరుట;

(యు) అగ్ని ప్రమాదము జరిగినప్పుడు దానిని చలార్పులకు నిర్ధిష్టమైన చర్యలు తీసికొనుట;

(వి) ఏదైన నిర్ధిష్ట మినహాయింపుకు లోబడి, ఏదైన నిర్ధిష్ట ప్రాంతములో ఉన్న ఏ వ్యక్తి గాని ఎవరేని నిర్ధిష్ట ప్రాధికారి లేక వ్యక్తి చే ఈయబడిన ప్రాతమూలకమైన అనుజ్ణా పత్రమువలన లభించిన అధికారముతో తప్ప, నిర్ధిష్టపరచబడు. వేళల మధ్య ఇల్లు వదలి బయటకు రాకూడదని ఆదేశించుట;

(డబ్ల్యు) (i) పౌరరక్షణకు భంగకరమైన విషయములలో ఉన్న ఏదైన వార్తాపత్రిక, వార్తా పత్రము, పుస్తకము , లేక ఇతర దస్తావేజు యొక్క ముద్రణను, ప్రచురణను నిషేధించుట;

(ii) ఉపఖండము (i)లో నిర్ధేశింపబడిన ఏదైన విషయమును కలిగి యుండు ఏదైన వార్తాపత్రికను, వార్తాపత్రమును, పుస్తకమును లేక ఇతర దస్తావేజును ముద్రించుటకు లేక ప్రచురించుటకు ఉపయోగించబడెడి ఏదైన ముద్రణాలయము నుండి హామీని అడుగుట, మరియు ఆ వార్తాపత్రము, పుస్తకము లేక ఇతర దస్తావేజు యొక్క ప్రతులను కోల్పోవునట్లుగా చేయుట;

(ఎక్స్) ఏ ప్రాంతముల నియంత్రణ ఆవశ్యకమని లేక సముచితమని భావించబడినదో ఆ ప్రాంతములోని వ్యక్తుల నడవడిని క్రమబద్దము చేయుట, మరియు అట్టి ప్రాంతముల నుండి వ్యక్తులను తొలగించుట,

(వై) ఏదైన పౌరరక్షణ పథకమును పాటించవల్సినదిగా ఏ వ్యక్తినైనను. లేక వ్యక్తుల వర్గమున్నెనను కోరుట;

(జడ్) పౌరరక్షణ ప్రయోజనములకు ఆవశ్యకమగు ఏదైన ఇతర నిబంధన;

(2) ఉపపరిచ్చేదము (1) కింద చేయబడిన ఏదైన నియమములో అందు నిర్దిష్టపరచబడిన విషయములను గూర్చిన ఉత్తరువులు రాజ్య ప్రభుత్వముచే చేయబడవచ్చునని నిబంధన చేయబడవచ్చును .