పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(iv) నీటి సరఫరా వనరులు మరియు పద్దతులు, నీరు గ్యాసు లేక విద్యుచ్చకి, సరఫరా కొరకైన నిర్మాణములు మరియు సార్వజనిక ప్రయోజనముల కొరకైన ఇతర నిర్మాణము లన్నియు;

(v) జలయానములు, విమానములు, మోటారు వాహనముల చట్టము, 1939 ( 1939 యొక్క 4వ చట్టము) లో నిర్వచింపబడిన రవాణా వాహనములు మరియు రైలు మార్గముల యొక్కయు ట్రాంమార్గముల యొక్కయు రోలింగు స్టాకులు;

(vi) గిడ్డంగులు మరియు నిలువచేయు ప్రయోజనముల కొరకు ఉపయోగించబడెడి లేక ఉపయోగించుటకు ఉద్దేశింపబడిన ఇతర స్థానములన్నియు;

(vii) సాధారణముగా గనులు, చమురు గనులు , ఫ్యాక్టరీలు లేక పారిశ్రామిక లేక వాణిజ్య సంస్థలు, లేక ప్రత్యేకముగా ఏదైన గని, చమురు గని, ఫ్యాక్టరీ లేక పారిశ్రామిక లేక వాణిజ్య సంస్థ;

(viii)వైజ్క్షానిక లేక సాంకేతిక పరిశోధన లేక ప్రశిక్షణ జరుపు లేక గరుపు ప్రయోగశాలలు మరియు సంస్థలు;

(ix) ఈ ఖండములో ఇంతకు పూర్వము పేర్కొనబడిన దేనిలోనైనను భాగమై యున్నట్టి లేక దానికి సంబంధించియున్నట్టి అన్ని నిర్మాణములు మరియు కట్టడములు;

(x) ఏది ప్రభుత్వము యొక్క లేక స్థానిక ప్రాధికారి యొక్క లేక పాక్షికముగా ప్రభుత్వము యొక్క లేక స్వాయత్త వ్యవస్థ యొక్క ప్రయోజనముల కొరకు ఉపయోగించబడుచుండునో లేక ఉపయోగించబడుటకు ఉద్దేశించబడినదో మరియు పౌర రక్షణను సునిశ్చితమొనర్చుటకు దేనిని రక్షించుట ఆవశ్యకమని లేక సముచితమని భావించబడినదో ఆటి ఏదైన ఇతర స్థానము లేక వస్తువు;

(పి) ఏదైన రోడ్డు లేక బాట , జలమార్గము , బల్లకట్టు లేక వంతెన, నది కాలువ లేక ఇతర నీటి సరఫరా వనరు యొక్క నియంత్రణ;

(క్యూ) ప్రభుత్వము లేక ప్రభుత్వము యొక్క ఏదేని విభాగము లేక ఏదేని స్థానిక ప్రాధికారము, పోలీసు బలగపు సభ్యులు, అగ్నిమాపక దళము, మరియు పౌరరక్షణ ప్రయోజనముల కొరకు కాకుండ ప్రధానముగ ఇతర ప్రయోజనముల కొరకు నియమించబడినట్టి ఏదైన సేవా లేక ప్రాధికారి యొక్క సభ్యులు తమతమ అధికారితలలో లేక తమచే నియమించబడిన సిబ్బందికి సంబంధించి తీసికొనవలసి యుండునట్టి ముందు జాగ్రత్త చర్యలు;

(ఆర్) అధికారికమైన లేక ఇతరమైన యూనిఫారంలను లేక పతాకములను లేక మెడల్స్, బ్యాడ్జీలు వంటి ఇతర అధికార అలంకారములను లేక ఇతర