పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఐ) ఈ క్రింద తెలిపిన వాటిని తన వద్ద ఉంచుకొనుటను, వాటి ఉపయోగమును, లేక వ్యయనమును నిషేధించుట లేక క్రమబద్దము చేయుట:-

(i) పేలుడు పదార్ధములు, మండే స్వభావము గల పదార్ధములు, క్షారక, లేక ఇతర అపాయకర పదార్ధములు లేక వస్తువులు, ఆయుధములు మరియు మందుగుండు సామగ్రి;

(ii) జలయానములు;

(iii) వెర్లెస్ టెలిగ్రాఫిక్ ఉపకరణములు;

(iv) ఎయిర్ క్రాప్టు; మరియు

(v) ఫోటో గ్రాఫిక్ మరియు సిగ్నలింగ్ ఉపకరణములు మరియు సమాచారమును రికార్డు చేయు ఏదైన సాధనము:

(జె) ప్రాంతములను ఖాళీ చేయుట మరియు అచటినుండి ఆస్తిని, జంతువులను తరలించుట;

(కె) ఏదైన ప్రాంతము నుండి నిర్వాసితులైన వ్యకులకు వేరొక ప్రాంతములో వసతి కల్పించుట మరియు అట్టి ప్రాంతములో వసతి కల్పించబడి నట్టి నిర్వాసితుల నడవడిని క్రమబద్దము చేయుట;

(ఎల్) నిర్వాసితులకు లేక ఈ చట్టము క్రింది కృత్యములను నెరవేర్చుటకు ప్రాధికృతులైన వ్యక్తులకు నివాస ఆదేశములిచ్చుట;

(ఎం) నష్టమ్మెన భవనములను, కట్టడములను మరియు ఆస్తిని ఉద్దరించుట మరియు శవములకు సంస్కారము జరుపుట;

(ఎన్) గాయపడినట్టియు, క్లెయిము చేయబడనట్టియు లేక అపాయకరమై నట్టియు, జంతువుల అభిగ్రహణ, వాటి అభిరక్ష లేక వాటిని నాశనము చేయుట;

(ఓ) ఈ క్రింది తెలిపినవి సురక్షితముగా ఉండునట్లు చేయుట: ---

(i) ఓడరేవులు, డాక్ యార్డులు, లైట్ హౌస్ లు , దీపపు ఓడలు , విమానాశ్రయములు మరియు వైమానిక యానమునకు సంబం ధించిన ఇతర సౌకర్యములు;

(ii) రైలు మార్గములు, ట్రాంమార్గములు, రోడ్లు, వంతెనలు ,కాలువలు మరియు భూమార్గమునగాని, జలమార్గమునగాని ఇతర రవాణా సాధనములన్నియు;

(iii) టెలిగ్రాపులు, తపాల కార్యాలయములు, సిగ్నలింగ్ ఉపకరణములు మరియు ఇతర కమ్యూనికేషన్ సాధనములన్నియు;