పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాని రాజ్యక్షేత్రము యొక్క ఏదైన భాగములో ఏదేని ప్రాణము ఆస్తి, స్థానము లేక వస్తువు యొక్క భద్రతకు ముప్పు కలిగించు నట్టి, ఎవరేని వ్యక్తిచే, లేక వ్యక్తుల నికాయముచే చేయబడు ఏదైన దాడి అని అర్ధము;

(డి) "అధిసూచన" అనగా అధికార రాజపత్రములో ప్రచురింపబడిన అధిసూచన అని అర్ధము;

(ఇ) "వైయక్తిక సేవా కృతి". వైయక్తిక కృతుల (అత్యవసర నిబంధనల) చట్టము, ( 1962 యొక్క 59వ చట్టము ) లో ఏ అర్ధమును కలిగి యున్నదో ఆ అర్ధమునే కలిగియుండును;

(ఎఫ్) ఒక సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధింది ".రాజ్య ప్రభుత్వము " అనగా ఆ సంఘ రాజ్యకేతము యొక్క పరిపాలకుడు అని అర్ధము.

అధ్యాయము- 2

పౌర రక్షణ కొరకు నియమములు చేయుటకు కేంద్ర ప్రభుత్వమునకు అధికారము

పౌర రక్షణ కొరకు నియమములు చేయు అధికారము -

3. (1) పౌర రక్షణ కలిగించుటకు కేంద్ర ప్రభుత్వము, ఈ క్రింద పేర్కొనబడిన విషయములన్నింటికైనను వాటిలో దేనికొరకైనను నిబంధనలు చేయుచు అధిసూచన ద్వారా నియమములు చేయవచ్చును, అవేవనగా: ---

(ఎ) ఏ పని వలన పౌర రక్షణకు బహుశ: భంగము కలిగించగలదో, ఆ పనిని చేయుటను నివారించుట;

(బి) పౌర రక్షణ గురించి జనసామాన్యమునకు శిక్షణ గరపుట మరియు అట్టి రక్షణకు వారిని తయారుచేయుట;

(సి) పౌర రక్షణ కొరకు అవసరమగు వస్తు, సామగ్రిని ఏర్పాటు చేయుట, నిల్వచేయుట, నిర్వహించుట;

(డి) ఓడరేవులలోను ప్రాదేశిక ఆటుపోటుల మరియు దేశీయ జలములలోను రాకపోకలను మరియు జలయానముల, బోయాల, దీపముల మరియు సంకేతముల ఉపయోగమును నిషేధించుట, లేక క్రమ బద్దము చేయుట;

(ఇ) దీపముల, ధ్వనుల నియంత్రణ;

(ఎఫ్) అగ్ని నివారక చర్యలను తదితర చర్యలను తీసికొనుట ద్వారా ప్రాణమును ఆస్తిని రక్షించుట;

(జి). శత్రు దాడి జరిగినచో ఎవైన భవనములను , భవనక్షేత్రాదులను లేక ఇతర కట్టడములను, వెంటనే గుర్తుపట్టే వీలు లేకుండా చేయుట;

(హెచ్) ప్రాణమునకు లేక ఆస్తికి అపాయము కలుగుటను నివారించుటకు ఏదైన భవనమును, భవనక్షేత్రాదులను లేక ఇతర కట్టడములను లేక ఏదైన ఇతర ఆస్తిని కూలగొట్టుట, నాశము చేయుట లేక పనికి రాకుండునట్లు చేయుట;