పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పౌర రక్షణ చట్టము, 1968

( 1908 లోని 27వ చట్టము)

(24 మే, 1968)

పౌర రక్షణ కొరకును దానికి సంబంధించిన విషయముల కొరకును

నిబంధనలు చేయుటకైన చట్టము

భారత గణరాజ్యము యొక్క పందొమ్మిదవ సంవత్సరములో పార్లమెంటు ఈ క్రింది విధముగ శాసనము చేయబడినది : -

అధ్యాయము

ప్రారంభిక

సంగ్రహ నామము, విస్తరణ మరియు ప్రారంభము.


1. (1) ఈ చట్టమును పౌర రక్షణ చట్టము, 1968 అని పేర్కొనవచ్చును.

(2) ఇది యావద్భారత దేశమునకు విస్తరించును.

(3) ఇది, ఏదైన రాజ్యములో లేక దాని భాగములో, భారత రక్షణ చట్టము, 1962 ( 1962 యొక్క 51వ చటము ) యొక్క ముగింపు తేదీకి పూర్వపు తేదీ కాకుండ, కేంద్ర ప్రభుత్వము అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి రావలెను; మరియు వేరు వేరు రాజ్యములకు లేక రాజ్యముల వేరువేరు భాగములకు వేరువేరు తేదీలు నియతము చేయబడవచ్చును.

నిర్వచనములు

2. ఈ చట్టములో, సందర్భమును బట్టి అర్థము వేరుగా ఉన్ననే తప్ప, -

(ఎ) "పౌర రక్షణ" లో భారతదేశములో లేక దాని రాజ్యక్షేత్రము యొక్క ఏదైన భాగములో ఎవరేని వ్యక్తికి, ఏదేని ఆస్తికి, స్థానమునకు లేక వస్తువుకు విమానము నుండి గాని భూమి నుండి గాని సముద్రము నుండి గాని లేక ఇతర స్థానముల నుండి గాని జరుగు ఏదైన శత్రు దాడి నుండి రక్షణ కల్పించుటకు , లేక అట్టి ఏదైన దాడిని పూర్తి గాగాని కొంత మేరకు గాని తొలగించుటకు, వాస్తవ పోరాటము క్రిందికి రానట్టి ఏవ్వెన చర్యలు- అట్టి చర్యలు అట్టి దాడికి పూర్వము, దాడి జరుగుచుండగా, దాడి సమయమున తీసికొనబడినను లేక దాడి సమయము తరువాత తీసికొనబడినను- చేరియుండును.

(బి) "పౌర రక్షణ దళము" అనగా పూర్తిగాగాని, ప్రధానముగా గాని పౌర రక్షణావశ్యకతలను పూర్తి చేయుటకు ఏర్పాటు చేయబడిన దళము అని అర్ధము; ఇందు పరిచ్ఛేదము 4, ఉప-పరిచ్ఛేదము (1) కి గల వినాయింపు క్రింద ఒక దళముగా భావించబడిన ఏదైన వ్యవస్థ చేరియుండును;

(సి) "శత్రు దాడి" అనగా ఏదైన యుద్దములో గాని, బాహ్య దురాక్రమణలో గాని, అంత: కల్లోలములో గాని అన్యధా గాని భారతదేశములో లేక