పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ

(శాసన నిర్మాణ విభాగము)


ఈ క్రింది చట్టములు, అనగా :- (1) కేంద్ర రిజర్వు పోలీసు బల చట్టము, 1949 (1949 లోని 66వ చట్టము); (2) పౌర రక్షణ చట్టము, 1968 (1968 లోని 27వ చట్టము); (3) ఎక్సైజు (మాల్ట్ మద్యముల) చట్టము, 1890 (1890 లోని 13 వ చట్టము); (4) భారత స్వాతంత్య్ర - పాకిస్తాను న్యాయస్థానముల (పెండింగు ప్రొసీడింగుల) చట్టము, 1952 (1952 లోని 9వ చట్టము); (5) జాతీయ అల్ప సంఖ్యాక వర్గముల కమీషను చట్టము, 1992 (1992 లోని 19వ చట్టము): (6) ఆటిజమ్, సెరిబ్రల్ పాల్సి, బుద్ధి మాంధ్యత మరియు బహు వికలాంగత కలిగిన వ్యక్తుల సంక్షేమ జాతీయ ట్రస్టు చట్టము, 1999 (1999 లోని 44వ చట్టము); (7) చిన్న నాణేముల (అపరాధముల) చట్టము, 1971 (1971 లోని 52వ చట్టము}, (8) పన్ను విధింపు శాసనముల (వసూలు ప్రోసీడింగుల కొనసాగింపు మరియు శాసనమాన్యత) చట్టము, 1964 (1964 లోని 11వ చట్టము) మరియు (9) పాస్ పోర్టు (భారతదేశములో ప్రవేశము) చట్టము, 1920 (1920 లోని 34వ చట్టము)ల యొక్క తెలుగు అనువాదములను రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందు మూలముగా ప్రచురించడమైనది. ఆ చట్టములకు గల ఈ అనువాదములను ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973 లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఏ) క్రింద, ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను. .