పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(సి) ఏదైన దళము యొక్క లేక అన్ని దళముల యొక్క సభ్యత్వ ద్రువీకరణ పత్రములను ద్రువీకరించవచ్చును.

అద్యాయము- 4

వివిధ విషయములు

వైయక్తిక కృతుల (అత్యవసర నిబంధనల) చట్టము యొక్క నిబంధనలు దళపు సభ్యులకు కలిగిన కృతులకు వర్తించుట.

10. వైయక్తిక కృతుల (అత్యవసర నిబంధనల) చట్టము, 1962 (1962 యొక్క 59వ చట్టము) యొక్కయు దాని కింద చేయబడిన ప్రతియొక పథకము యొక్కయు నిబంధనలు. అవి ఒక పౌరరక్షణ స్వచ్ఛంద సేవకునికి కలిగిన వైయక్తిక సేవా కృతికి వర్తించునట్లు గనే, దళపు సభ్యుడుగా నియమించబడిన ఎవరేని వ్యక్తికి కలిగిన వైయక్తిక సేవా కృతికి ఈ క్రింద తెలుపబడిన మార్పులకు లోబడి వీలైనంతమేరకు వర్తించవలెను. ఆ మార్పులేవనగా-

(ఎ) ఆ చట్టము క్రింద లేక దాని క్రింద చేయబడిన ఏదైన పథకము క్రింద పౌరరక్షణ గూర్చిన వాడిన నిర్దేశము దళపు సభ్యుని గూర్చిన నిర్దేశముగా అన్వయించబడవలెను. మరియు

(బి) దళపు సభ్యునికి సంబంధించి అందులోని అత్యవసర పరిస్థితి యొక్క కాలావధిని గూర్చిన ఏదైన నిర్దేశము, ఈ చట్టము అమలులోనున్నప్పటి కాలావధిగా అన్వయించబడవలెను.

11. (1) 8వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (2) క్రింద ఉత్తరువు ద్వారా పిలువబడిన మీదట దళము యొక్క ఏ సభ్యుడైనను అట్టి ఉత్వరువును పాటించుటకు లేక అట్టి సభ్యుడిగా తన కృత్యములను నిర్వర్తించుటకు లేక అతని కృత్యముల పాలనకై అతనికి ఈయబడిన ఏదైన నిధ్యుక్తమైన ఉత్తరువును లేక ఆదేశమును పాటించుటకు సరియైన కారణము లేకుండ ఉపేక్షించుచో లేక నిరాకరించుచో, అతడు అయిదువందల రూపాయల దాక ఉండగల జరిమానా తోను, మరియు అట్టి ఉపేక్ష లేక నిరాకరణ కొనసాగుచున్నదైనయెడల, మొదటి జరిమానా తరువాత అట్టి ఉల్లంఘన కొనసాగు కాలావధిలో ప్రతి దినమునకు ఏబది రూపాయల దాక ఉండగల అదనపు జరిమానాతోను శిక్షింపదగియుండును.

(2) ఏ వ్యక్తి యైనను, అతనికి ఈ చట్టము క్రింద గాని, ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల క్రింద గాని ఇవ్వబడిన ఏదైన ఉత్తరువును లేక ఆదేశమును పాటించుటకు సరియైన కారణము లేకుండ ఉపేక్షించుచో లేక పాటించ కున్నచో అతడు అయిదు వందల రూపాయల దాక ఉండగల జరిమానాతోను, మరియు అట్టి ఉపేక్ష లేక పాటించకుండుట కొనసాగుచున్నదైనయెడల, మొదటి జరిమానా తరువాత అట్టి ఉపేక్ష లేక పొటించకుండట కొనసాగు కాలావధిలో ప్రతి దినమునకు ఏబది రూపాయల దాక ఉండగల అదనపు జరిమానాతోను శిక్షింపదగియుండును.

ఇతర శాసనములతో అసంగతముగా నున్న, చట్టము మరియు నియమములు మొదలైన వాటి ప్రభావము.

12 (1) ఈ చట్టము గాక ఏదైన ఇతర అనుశాసనములో లేక ఈ చట్టము గాక ఏదెన ఇతర అనుశాసనమును బట్టి ప్రభావము కలిగియున్న ఏదైన పత్రములో తద్విరుద్దముగ ఏమీ ఉన్నప్పటికిని, ఈ చట్టము యొక్క నిబంధనలు లేక దాని క్రింద చేయబడిన ఏవైన నియమములు లేక ఈ చట్టము క్రింద గాని ఏదైన అట్టి నియమము క్రింద గాని చేయబడిన ఏదైన ఉత్తరువు ప్రభావము కలిగియుండును.