పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{2) పౌరరక్షణకు సంబంధించిన ఏదైన శాసనము ద్వారా గాని దాని క్రింద గాని, ఈ చట్టము ప్రారంభమగుటకు పూర్వము పౌరరక్షణకు సంబంధించి చేయబడిన ప్రతియొక నియామకము, ఉత్తరువు లేక నియమములు, అది ఈ చట్టము యొక్క నిబంధనలకు అసంగతముగా లేనంతమేరకు, ఈ చట్టము క్రింద అది రద్దు చేయబడువరకు లేక మార్చబడు వరకు అమలులో కొనసాగవలెను మరియు ఈ చట్టము యొక్క తత్సమానమైన నిబంధనల క్రింద చేయబడినట్లు భావించబడవలెను.

విశదీకరణ : - ఏదైన నిబంధన లేక ప్రాంతము విషయములో " ఈ చట్టము యొక్క ప్రారంభము ", అనగా ఆ ప్రాంతములో ఆ నిబంధన ప్రారంభమగుట, లేక, సందర్భానుసారముగ, ఈ చట్టము ప్రారంభమగుట, అని అర్ధము.

13. ఈ చట్టము ననుసరించి వ్యవహరించుచున్న. ఏ ప్రాధికారిగాని వ్యక్తి గాని సామాన్య జీవన వ్యాసంగములలోను ఆస్తిని అనుభవించుటలోను, ప్రజాభద్రతను మరియు పౌరరక్షణను కాపాడు నిమిత్తము అనువుగా నుండునంత తక్కువ జోక్యము కల్పించుకొనవలెను.

14. . (1) ఈ చట్టము ద్వారా గాని దాని క్రింద గాని ఒసగబడిన ఏదైన అధికారమును వినియోగించుచు చేయబడిన ఉత్వరువు ఏదియు ఏ న్యాయస్థానము లోసు ప్రశ్నగతము కారాదు.


(2) ఏదైన ఉత్తరువు ఈ చట్టము , ద్వారా గాని దాని క్రింద గాని ఒసగబడిన అధికారమును వినియోగించుచు ఎవరేని ప్రాధికారిచే చేయబడి సంతకము చేయబడినట్లు భావించవల్సియున్నయెడల, భారత సాక్ష్య చట్టము, 1872 ( 1872 లోని 1వ చట్టము) యొక్క అర్ధములో అట్టి ఉత్తరువు అట్టి ప్రాధికారిచే చేయబడినదని న్యాయస్థానము పురోభావన చేయవలెను.

సాయుధ బలములు రక్షణకై తీసికోనబడిన చర్యలకు ఈ చట్టము వర్తించకుండుట.

15. సంఘ సాయుధ బలములకుగాని, అట్టి బలముల పొరరక్షణ లేక భద్రతను కాపాడుటకై లేక ఏదైన నౌకా, సైనిక లేక వైమానిక బలముల ప్రతిష్టాపనలు లేక భండారముల రక్షణ కొరకు - సంఘ సాయుధ బలములపై నియంత్రణ కలిగియున్న ఎవరేని ప్రాధికారులచే తీసికొనబడిన ఏవైన చర్యలకు గాని, ఈ చట్టము లేక ఈ చట్టము క్రింద చేయబడిన ఏదైన నియమము, వినియనుము లేక ఉత్తరువులో నున్నదేదియు, వర్తించదు.

16. ఈ చట్టము క్రింద శిక్షింపదగిన ఏదైన అపరాధమునకై అభియోగ మేదియు, ఏ వ్యక్తి పైనగాని, కంట్రోలరు లేక ఈ విషయమున కంట్రోలరుచే ప్రాధికృతుడైన ఎవరేని వ్యక్తిచే తప్ప, లేక వారి సమ్మతితో తప్ప, తేబడరాదు.

ప్రత్యాయోజనము చేయు అధికారము,

17. రాజ్య ప్రభుత్వము అధిసూచన ద్వారా----

(ఎ) ఈ చట్టము క్రింద తనచే వినియోగించబడు అధికారములన్నీగానీ, వాటిలో ఏవైనను గాని, ఆ అధిసూచనలో నిర్ధిష్ట పరచబడునట్టి పరిస్థితులలోను ఏవైన ఉన్నయెడల, అట్టి షరతులపైనను, రాజ్య ప్రభుత్వము అభిప్రాయములో ఒక జిల్లా మేజిస్ట్రేటు హోదాకు తక్కువకాని, సదరు అధిసూచనలో నిర్ధిష్టపరచబడు. అధికారిచే కూడ వినియోగించబడవలెననియు;