పుట:పౌర రక్షణ చట్టము, 1968.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ చట్టము క్రింద కంట్రోలరుచే వినియోగించబడదగు అధికారములన్ని లేక ఆ అధికారములలో ఏవైనను, ఆ అధిసూచనలో నిర్ధిష్టపరచబడు నట్టి పరిస్థితులలోను ఏవైన ఉన్నయెడల అట్టి షరతులపై నను, రాజ్య ప్రభుత్వము అభిప్రాయములో ఒక సబ్-డివిజనలు మేజిస్ట్రేటు హోదాకు తక్కువకాని, సదరు అధిసూచనలో నిర్ధిష్టపరచబడు అధికారిచే కూడ వినియోగించబడవలెననియు;

ఆదేశించవచ్చును.

సద్భావపూర్వకముగ తీసుకోనబడిన చర్యకు

16. ఈ చట్టము క్రింద లేక దాని క్రింద చేయబడిన ఏవేని నియమములు లేక ఉత్తరువుల క్రింద లేక ఏదైన అట్టి నియమము క్రింద జారీ చేయబడిన ఏదైన ఉత్తరువు క్రింద సద్భావపూర్వకముగా చేయబడిన లేక చేయుటకు ఉద్దేశింపబడిన దేనిని గూర్చియైనను రాజ్య ప్రభుత్వముపై గాని ఆదేశకునిపై గాని లేక కంట్రోలరుపై గాని లేక ప్రభుత్వముచే లేక కంట్రోలరుచే ప్రాధికృతుడైన ఏ వ్యక్తిపై గాని ఎట్టి దావా, అభియోగము లేక ఇతర శాసనిక ప్రోసీడింగులు ఉండవు .

(2) ఈ చట్టము లేక దాని క్రింద చేయబడిన ఏదైన నియమము లేక ఏదేని అట్టి నియమము క్రింద జారీచేయబడిన ఏదైన ఉత్తరువు క్రింద, సద్భావ పూర్వకముగ చేయబడిన లేక చేయుటకు ఉద్దేశింపబడిన దేని వలననై నను కలిగిన లేక బహుశ: కలుగగల ఏదైన నష్టమునకు, ప్రభుత్వముపై గాని, డెరెక్టరుపై, గాని, కంట్రోలరుపై గాని, లేక ప్రభుత్వముచే లేక కంట్రోలరుచే ప్రాధికృతుడైన ఏ వ్యక్తిపై గాని, ఎట్టి దావా ఇతర శాసనిక ప్రోసీడింగులు ఉండవు.

ప్రాధికృత వ్యక్తులను దళపు సభ్యులను ప్రభుత్వ సేవకులగుట,

19.ఈ చట్టము క్రింద కంట్రోలరుచే గాని రాజ్య ప్రభుత్వముచే గాని ప్రాధీకృతుడైన ఏ వ్యక్తి యైనను, మరియు దళపు ప్రతి సభ్యుడును, అట్లు పనిచేయుచున్నపుడు, భారత శిక్తా స్మృతి (1860 యొక్క 45వ చట్టము) యొక్క 21వ పరిచ్ఛేదము యొక్క అర్ధములో ఒక ప్రభుత్వ సేవకుడుగా భావింపబడవలెను.

నియమములు మరియు వినియమములు పార్లమెంటు సమక్షమున ఉంచబడవలసి యుండుట


20. ఈ చట్టము క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రతి నియమమును, మరియు ప్రతి వినియమమును దానిని చేసిన పిమ్మట వీలైనంత త్వరితముగా పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున మొత్తము ముప్పది దినముల కాలావధిపాటు దాని ప్రతి యొక్క సదనము సమక్షమున, ఉంచవలెను. అట్టి కాలావధి ఒకే అధివేశనములో గాని రెండు అనుక్రమ అధివేశసములలో గాని చేరియుండవచ్చును; మరియు అట్లు ఉంచబడిన అధివేశనము ముగియు లోపలగాని దానికి అవ్యవహితముగా వచ్చు అధివేశనములోగాని ఉభయ సదనములు ఆ నియమములో లేక వినియమములో ఏవేని మార్పులు చేయుటకు అంగీకరించినచో, లేక సందర్భాను సారముగ ఆ నియమము లేక వినియమము అట్లు చేయబడరాదని ఉభయ సదనములు అంగీకరించినచో అటు పిమ్మట ఆ నియమము లేక వినియమము అట్టి మార్పు చేయబడిన రూపములో మాత్రమే తదనంతర ప్రభావము కలిగి యుండును లేక సందర్భానుసారముగ ప్రభావరహితమై యుండును; అయినప్పటికినీ అట్టి మార్పుగాని రద్దుగాని అంతకు పూర్వము నియమము క్రింద లేక వినియమము క్రింద చేసిన దేని శాసనమాన్యతకైనను భంగము కలిగించదు.