పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాడుజేయుచు నుంటివి, పాట నీకు
నేర్పెదను గాన నా యొద్దనే పరుండు.


తే.

అపరకర్మంబులను జేయునట్టివేద
మేల చదివెదు, ఛీ! నాకు చాలకష్ట
మట్టివేదము విందు వహా! యి దేమొ
కాంచఁగూడదె మఱి కొన్నిగ్రంథములను?


తే.

ఒడుగు చేయింతువో చిన్నిబుడుతవాని
కహహ! పెండిలి చేయింప నరుగువాఁడ
వా? వచింపుము యేటి కీ పాడువేద
మెవరు బోధించి రయ్య నీ కిది వృథాగ.


తే.

క్రొత్తవారలు దీనిని గొప్పగాను
భావనలు చేయుచుందురు ప్రాఁతవడ్డ
విసుగుకొందురు, పరు లేరు వినిన మెత్తు
రక్కటా! కైత గాన మాహావరింపు.


తే.

కవన మల్లుట నేర్పెదఁ గాక యున్న
వీణె నేర్పెద సంగీతవిధులలోన
బ్రాజ్ఞునిగఁ జేతు నేర్చుకో, పాడువేద
మెవరు వత్తురు? దానియ దేమి ఘనత?


తే.

కవన మల్లిన సంగీతకళ యెఱిఁగిన
పరులు కొనియాడుచుందురు పట్టుపట్టి
కామినులు నీదు కూటమికై దలంతు
రయ్యయో? వేద మేల నీ యందమునకు.


తే.

చదివితివి కావ్యములు కొన్న చాల వఱకు
శాస్త్రములఁ జూచినావు రసమ్ము లెల్ల
నేర్చితివి, గాన కవనము నేర్పె దేను
తాతతో మైత్రి మాని పెత్తనముఁ బూను.