పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని పలుకఁగ విని యాతఁడు
మనమున సంతోష మంది ‘మానిని! నే నిం
ద్రునిఁ జూడఁ బోవవలె, నీ
తనిఁ జూడుమ ప్రీతి’ నని సుధానిధిఁ జూపెన్.


తే.

‘ఎచటి కేగిన నీతని నేల నాకు
నొప్పఁ జెప్పెద రొక మీకె యుండె నొక్కొ
వీనిపైఁ బ్రీతి నే లేని దానివలెను
గానుపించెదనే మీదు కన్నులకును?’


క.

అని వానితోఁడ బలికిన
విని యంత నతండు జరుగువిధు లరయుటలో
మునిఁగికొనియుండ తారా
వనితామణి యాత్మ నిటుల భావించుకొనున్.


తే.

పోవఁ డింకేల నీ ముదిముండకొడుకు
జాము గా వచ్చె పిలుపంది జాగుసేయు
చుండె నని, పోనిలే యని సోగకనులు
చందురునిమీఁదఁ బఱపె నా చంద్రవదన.


తే.

‘గురువుగా రేగుచున్నారు గురుని పనులు
బడియె నీ తలపైన నీ భార మెట్లు
మోసెదవొ’ యంచు దరిజేరి ముద్దు బెట్టి
తారకారాజు నా తార తాఱితాఱి.


తే.

తారకారాజవా నీవు తార నేను
మనలమాత్రమె యుంచి తాఁ జనును కాదె
భయముచేతను నిద్దుర బట్ట దిఁకను
నీవునుంగూడ నా వంటి నియతిఁ గొనుము.


తే.

పాడువేదమ్ము లెల్లను బఠన చేసి
చక్కఁదనములగొంతుక చక్కఁదనము