పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తాత పెండిలిఁ జేయఁగా తరలు నపుడు
పోయెదవె నీవు, బియ్యపుమూట మోయ,
చదువుచుంటివి వేదముల్ చాలు చాలు,
వేద మెటువంటిదె వినలేదు నీవు.


తే.

భార్యపై రోఁతఁ బుట్టించు, భార్య యైన
పతిని మెచ్చని యట్లు చేడ్పరచు, పరుల
కాంత నైనను మోహింపఁ గడఁగె నేని
వలవ ననిపించు వేదమ్ము వాస్తవమ్ము.


తే.

ముష్టి నెత్తించు తుదకు సంతుష్టిఁ ద్రుంచి
సొగసు చెడగొట్టు రసికతఁ దగులఁ బెట్టు
ముదిమి గనుపించు రోఁతను ముట్టడించు
వెఱ్ఱివెంకన్నలకుఁ దప్ప వేద మేల?


తే.

తాతతోఁ గూడి నీవును తాతబుద్ధి
నేర్చుకొన బోకు, నావలె నీదు భార్య
దుఃఖపడు నిన్నుగాంచియే తుదిని నేను
ప్రాణములతోడ నుంటి నిప్పట్టు నందు.


తే.

అనుచు క న్గీటు తన జాణతనము జూచి
నంతలో చందురుఁడు వేగ నరిగె గదికి
తారయుం గూడ నాతని జేర నరిగి
కంచుకముఁ దీసి యా సుధాకరుని కొసఁగె.


తే.

‘ప్రాణమా, వీపు పై జూడు మబ్బ! చీమ
ప్రాఁకుచున్నది’ యన వాఁడు బాలవీపుఁ
జూచుచుండగఁ పయ్యెదచెంగు జార్చి
కనరె నంతయుఁ బరికింపఁ గా వలె నని.


తే.

స్వర్ణమయకాంతులం దేలు చాన వీపు
చేతితో రాయఁగా వాఁడు, చేడె మిన్న