Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యూదులు తిరిగి పాలస్తీనా చేరుకోవలసిందే! పాలస్తీనా చాలా చిన్న దేశం. అక్కడ ప్రపంచంలోని అందరు యూదులు స్థిరపడ్డానికి తగినంత ప్రదేశంలేదు. అంచేత అందరూ అక్కడికి చేరుకోవడం అనేది అసంభవం. కాకపోతే సంభవం కాగల కార్యం ఏదంటే,- పాలస్తీనా యూదీయులకు తిరిగి జాతీయ కేంద్రం కావడం. "జాతీయ కేంద్రం" అనే ఈ ఆశయాన్ని సాధించడానికే హెర్జల్ 1897లో "జియోనిజం" అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు.

హెర్జల్ ప్రారంభించిన ఈ ఉద్యమం అతడి ప్రతిభా విశేషం వల్లనేమి, రాజకీయ చతురత వల్లనేమి[1] సత్వరాభి వృద్ధిని చెంది, ఐరోపా మహాసంగ్రామం నాటికి ప్రపంచ వ్యాప్తిని గాంచింది.

5

యుద్ధం వ్యయంతో కూడిన వ్యాపారం. ఈ వ్యయమైనా ఒక కోటీ, రెండుకోట్లూ కాదు; శతకోట్లు, సహస్రకోట్లు. ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం అదనపు శిస్తుల వల్ల సంపాయించడం పడదు. అంచేత, ఋణాన్ని చేసితీరాలి. ప్రభుత్వాలకు పెద్ద పెద్ద ఋణాల్ని ఇవ్వగలవారు బ్యాంకర్లు. లండన్, ప్యారిస్, న్యూయార్క్: ఈ నగరాలలోని పెద్ద బ్యాంకర్లు చాలా వరకు యూదుజాతివారు. అంచేత ఈ నగరాలలో తనకు తగిన పరపతి పుట్టాలంటే, తాను "జియోనిజం" పట్ల అభిమానాన్ని చూపించాలని బ్రిటన్ అనుకుంది. ఈ ఆలోచనతో యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనాను యూదీయులకు జాతీయ కేంద్రంగా చేస్తానని అది వాగ్దానం చేసింది.

బ్రిటన్ యూదులకు ఈ విధంగా వాగ్దానం చెయ్యడానికి ఇంకో కారణం కూడా ఉంది. బాంబుల్ని చెయ్యడానికి "ఆల్కొహాల్" చాలా అవుసరం. యుద్ధ సమయంలో మామూలుగా ఉండే చిక్కుల వల్లనేమి, జర్మన్ సబ్ మెరీనులు ఓడల్ని ముంచి వేస్తూ ఉండడం వల్లనేమి, బ్రిటన్​కు "ఆల్కొహాల్" తగినంతగా దొరకడం అసాధ్యమైపోయింది. ఈ కష్టసమయంలో డాక్టర్ చెయిమ్ వైజ్​మన్ కేవలం దేవుడిలా అడ్డుపడ్డాడు.

డాక్టర్ వైజ్​మన్ మాంఛెస్టర్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ప్రొఫెసర్. అతడి పుట్టుక రష్యన్ పోలెండ్​లో.[2] చదువుకున్నది జర్మనీలో 1904 ప్రాంతాలలో ఇంగ్లండ్ వచ్చి, అక్కడనే నివాసం ఏర్పరచుకున్నాడు. బ్రిటన్​లోని "జియోనిస్టు" నాయకులలో అతడే అగ్రగణ్యుడు. "ఆల్కొహాల్" తగినంతగా లభించక బ్రిటన్ విషమస్థితిలో పడ్డప్పుడు డాక్టిర్ వైజ్​మన్ కొయ్యలో నుంచి దాన్ని (ఆల్కొహాల్) తియ్యడానికి ఒక చక్కటి పద్ధతి కనిపెట్టాడు.

ఆపత్సమయంలో ఇంత మహాపకారాన్ని చేసినందుకు చాలా సంతోషించి, అప్పటిలో బ్రిటిష్ ప్రభుత్వంలో "మ్యూనిషన్సు" (ముందుగుండు) మంత్రిగా ఉన్న లాయడ్ జార్జి "మిమ్మల్ని

  1. హెర్జల్ 1904లో మరణించాడు.
  2. అంటే, అప్పటిలో రష్యా పరిపాలన కిందవున్న పోలెండ్ రాజ్యభాగంలో.