"భారతీయులకు స్వపరిపాలనాధికారాన్ని ఇవ్వడమే మా అంతిమ (Ultimate) ఆదర్శం", అని బ్రిటీష్ వారు ఇంతకుముందు ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు వారు "పాలస్తీనాను చివరికి (Ultimately) స్వతంత్ర రాజ్యంగా చెయ్యాలని మా ఆశయం" అని అంటున్నారు. "చివరికి" అంటే ఎప్పటికి? ఈ శతాబ్దం చివరికా? లేక, పై శతాబ్దం చివరికా?
ఉన్నతమైన ఈ ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతానికి ఈ క్రింది ఏర్పాట్లను చేస్తారట.
పాలస్తీనాను యూదు జాతీయ కేంద్రాన్ని చేయడమనే ప్రయత్నాన్ని విరమించడం.
అందరు పౌరులకు సమాన హక్కుల్ని ఇవ్వడం.
యూదు మైనారిటీ సంఘ సంక్షేమానికి తగిన రక్షణాల్ని ఏర్పాటు చెయ్యడం.
దేశ రక్షణ విషయమై సంధిని చేసుకోవడం.
ఆరబ్బు, యూదు, బ్రిటీష్ సభ్యులతో శాసన సభను ఏర్పాటు చెయ్యడం.
ఆరబ్బులనూ, యూదులనూ, వీలునుబట్టి ఆలోచించడానికి మళ్ళీ కొంతకాలానికి ఇంకొక సమావేశాన్ని లండన్లోనే జరుపుతామని బ్రిటీష్ వారు అన్నారు. ఇంకొక దేశ పరిపాలనలో భాగస్వాముల్ని చెయ్యడం.
ఈ ఏర్పాట్లకు ముందు ఒప్పుదలయైతే, వీటికి సంబంధించిన వివరాల్ని గురించి నిర్ణయాన్ని చెయ్యడానికి తిరిగి ఇంకొక సమావేశాన్ని జరుపుతామని అన్నారు.
19
ఇందుకు సమావేశాన్ని పైసారికి వాయిదా వెయ్యడం అనవసరమనీ, ఆ వివరాల సంగతి కూడా ఇప్పుడే బయలుపెట్టవలసిందనీ ఆరబ్బులు పట్టుపట్టగా, వాటిని కూడా తెలియచేశారు. అవి ఏవంటే—
దేశాన్ని రెండు మూడు ఖండాలుగా విభజించడం,
ఒక్కొక్క ఖండానికి ఒక అసెంబ్లీని, ఒక కౌన్సిల్నూ, (మన మద్రాసు రాజధానిలో రెండు శాసనసభలు ఉన్నట్టుగా) ఏర్పాటు చేయ్యడం,
రెండింటికీ కూడా ఆరబ్బు, యూదు, ప్రతినిధుల్ని మొత్తం జనాభాలో వారి వారి జాతుల దామాషా ప్రకారం ఎన్నుకోవడం.
మెజారిటీ ఓట్లను బట్టి అసెంబ్లీలో నిర్ణయాల్ని చెయ్యడం.
ఇక, కౌన్సిల్లో మెజారిటీ, మైనారిటీలతో నిమిత్తం లేకుండా ఆరబ్బులు, యూదులు విడివిడిగా ప్రతి తీర్మానం మీద విడివిడిగా ఓటు చెయ్యడం.