Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

"డ్జాబా అనే ఆరబ్ గ్రామంలో నలుగురు యూదీయులు చాలా మంది ఆరబ్ స్త్రీలను మానభంగం చెయ్యబోయారు. రాళ్ళనూ, రప్పల్నీ పుచ్చుకుని ఆ స్త్రీలందరు తమను రక్షించుకోబోగా, ఈ మానవాధములు వారిలో ఒక సాధ్విని తుపాకితో కాల్చివేశారు.

"తమకు ఆయుధాలు లేకపోయినా, ఆరబ్ గ్రామస్థులు—జరిగిన దారుణ హత్యను చూచి భయపడిపోకుండా—ఆ రాక్షసుల్ని ఎదిరించారు. ఆ నలుగురిలోను ఇద్దరు యూదులు తప్పించుకుపోయారు. మిగిలిన ఇద్దరు పట్టుబడ్డారు. వారి చేతిలోని తుపాకుల్ని లాక్కుని, వారిని ఆరబ్బులు అక్కడక్కడే రాళ్ళతో కొట్టి చంపారు."

జర్మన్ నాజీ పత్రిక ఈ విషయాన్ని ప్రకటించింది గనక ఇది కల్పితమైనదేమో అనే సందేహం కలగవచ్చును. కాని, యూదులు చేస్తున్న దురంతాల్ని గురించి సందేహానికి ఎడమివ్వని కథలెన్నో ఉన్నాయి. వారు సరిగా శుక్రవారం నాడు మసీదుల ప్రాంతంలో బాంబుల్ని వేస్తున్నారు. శుక్రవారం నాడు మహమ్మదీయులందరు నమాజ్ కోసం మసీదులలో చేరతారు. అంచేత ఆనాడు ఆ ప్రాంతాలలో బాంబుల్ని విసిరితే, చాలా ఎక్కువమంది హతులౌతారని వారి ఉద్దేశం. నిజంగా చాలామంది ఇదే ప్రకారం హతులౌతున్నారు కూడా. జెరుసులం లోని ఒక పెద్ద మసీదులో 1938 జులై 15వ తేది శుక్రవారం నాడు ఆరబ్బులు ప్రార్థనలు చేసుకుని వస్తూవుండగా, వారి మీద బాంబు పడింది. అందుమూలంగా ముగ్గురు మగవాళ్ళు, ఆరుగురు ఆడవాళ్ళు, ఒక బిడ్డ చనిపోయారు; ఇరవై మంది మగవాళ్ళు, పదిమంది ఆడవాళ్ళు గాయపడ్డారు. వీరిలో కొందరికి ప్రాణాపాయకరమైన గాయాలు తగిలాయి. పగిలిన పుర్రెలతో, తెగిపడ్డ కాళ్ళ చేతులతో, కాల్వలు కట్టిన నెత్తురుతో ఆ ప్రదేశం ఎంత భీభత్సంగా కనబడిందో చెప్పతరంగాదు!

ఈ ఒక్క శుక్రవారం నాడు మాత్రమే కాదు; వరసగా అనేక శుక్రవారాల నాడు మసీదుల వద్ద ఇదేవిధంగా బాంబులు పడ్డాయి; ఇంత ఎక్కువగానూ జననష్టం జరిగింది. ఇంతటి ఘోరాలు జరుగుతూ ఉంటే, వీటిని గురించి యూదు పత్రికలు చేసిన వ్యాఖ్య ఇది: "యూదులకు ఈ పాపాన్ని అంటగట్టి వారి మీద లోకానికి అసహ్యం కలిగించాలనే దురద్దేశంతో ఆరబ్బులే ఈ విధంగా బాంబుల్ని విసరుతున్నారు". దీన్ని చూచినప్పుడు ఆరబ్బుల గుండె ఇంకెంతగా మండుతుందో ఎవరికివారు ఊహించుకోవలసిందే!

యూదులు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా, ఏమి దౌష్ట్యాలను చేసినా, బ్రిటీష్ అధికారులు చూచీచూడనట్టు ఊరుకుంటారు. తప్పనిసరి వచ్చి శిక్ష వెయ్యవలసి వచ్చిన పక్షంలో, చాలా తేలికగా వదిలివేస్తారు. ఒకే నేరానికి ఆరబ్బుకు మరణశిక్ష, యూదీయునికి కొద్దిపాటి జైలుశిక్ష పడిన ఉదాహరణలకు లెక్కలేదు.

షేక్ ఫరహాన్ సాదీ అనే ఆరబ్బు ముదుసలికి—వయస్సు 80 సంవత్సరాలు—అతడి ఇంటిని సోదా చూడగా, గోడలో ఒక రివాల్వర్ కనబడిందనే నేరం కింద మరణశిక్ష వేశారు. 1938