పుట:పల్నాటి చరిత్ర.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

పల్నాటి చరిత్ర

వీరులచేత కట్టబడిన యాగుడిని యాసంవత్సరములో నొక నాయుడు బాగుచేయించినట్లుగల శాసనము,

6. సూరేశ్వరస్వామి గుడియొక్క ముఖమండపపు స్తంభముమీద శక 1186 (1261 A.D) నాటిది రుద్రమదేవియొక్క గవర్నరగు జన్నిగ దేవమహారాజులు యిచ్చి దాన శాసనము.

7. ఆగుడియొక్క యింకొక స్తంభముమీద రెండవ ప్రతాపరుద్రుని కాలమున శశ 1239 (1317 A.D.) నాటి దానశాసనము. అందులోనే మఱియొక స్తంభముమీద శక 1227 (A. D. 1305) రెండవ ప్రతాపరుద్రుని కాలము నాటి శాసనము.

8. శశ 1076 (1154 A.D.) కుళుత్తుంగచోళుని ప్రధానమంత్రి దీపారాధనకిచ్చిన భూదానశాసనము. సూరేశ్వరస్వామి గుడిలో తూర్పుప్రాకారములోనున్న రాతిమీదకలదు.

9. రెండవ ప్రతాపరుద్రుని పేరు నమోదు చేయుచు శక 1225 (A D. 1303) నాటి శాసనము ఒక స్తంభముమీద కలదు.

10. శక 1229 (1307 A. D.) న శ్రీమతుమాంచయ నాయనింగారి పుణ్యమునకుగాను వారి అడపం పోచూలెంకంగారు సూరేశ్వర దేవరగుడికి సున్నము పెట్టించినట్లు శాసనము.

అమీనాబాదు శాసనము

ఉ॥ ధాటిగ నేగి యుద్ధగిరి దార్కొని వేంకటరాజుదోలి ముం
    గోటలు లగ్గబట్టి వినుకొండయు బెల్లముకొండ తంగెడల్