పుట:పల్నాటి చరిత్ర.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

27

తుమ్మురుకోడు:- ఇచ్చటనొక పెద్దమశీదు కలదు. 1766, 1773, 1774, 1778 లో చనిపోయిన ఆంగ్లేయ సైనికోద్యోగుల సమాధులు కలవు. క్లైవుకాలమందలి ఆర్కాటు నవాబగుమహమ్మదాలీ పేరుకూడ యిందు నమోదు కాబడినది. ఈ ప్రాంతములో జరిగిన యొకయుద్ధములో చనిపోయిన ఫ్రెంచి యింగ్లీషు సైనికుల సమాధులుకూడ కలవు.

వెల్దుర్తి. సహగమనము చేసి సతీత్వమునొందిన స్త్రీల గూర్చి రెండుశిలలు కలవు. శక 1087 (1165 A.D.) నాటిది చదువుటకు వీలు లేని శిధిలమగు శాసన మొకటి కలదు.

1. కారెమపూడి:- శక 1536 (1614 A.D.) న నొక స్తంభమును నిర్మించినట్లు వీరులగుడుల మంటపమునకు దక్షిణము గానున్న నొక రాతిమీద శాసనము.

2. ఆగుడియొక్క తూర్పు ప్రాకారమునకు దగ్గరనున్న నొకరాతిమీద శక 1318 (1396 A D.) నాటి శాసనము.

3. ఆ గుడియొక్క ధ్వజ స్తంభమునకు వెనుక చిన్న మండ పమునకు తూర్పుగానున్న యొక రాతిమీద శక 1246 (1324 A.D.) నాటి శాసనము.

4. ఆగుడియొక్క ముఖమండపముయొక్క స్తంభము మీద నామండప నిర్మాణము గూర్చి శక 1255 (1333 A. D.) నాటి శాసనము.

5. ఊరిలో విష్ణుగుడి బయటి ప్రాకారములోగల రాతి మీద :శక 1549 (1627 A D.) నాటి శాసనము. పల్నాటి