పుట:పల్నాటి చరిత్ర.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

29

    పాటిపరిన్ హరించి మఱి బల్మిని గైకొని కొండవీడు క
    ర్ణాటక రాజధాని నిభరాముడు బాహుబలంబుమీఱుచున్

గోల్కొండ నవాబగు మహమ్మద్ ఖులీ కుతుబ్ శా యొక్క మంత్రియగు అమీనుముల్కు క్రీ.శ. 1592-93 న యీశాసనము వ్రాయించెను, ఈ అమీన్ ముల్కుయే పొన్నిగంటి తెలగనార్యునిచే యయాతి చరిత్రము నంకితముగాంచిన యమీనుఖాను. పల్నాటిలోని పెందోటకు ప్ర భు వ గు మార్కండేయుడీ కుతుబ్ రశాహికి సామంతుడుగ నుండెను. ఈ శాసనములో శక 1502 విక్రమసం॥ (క్రీ.శ. 1580) చైత్ర బ 14 భౌమవారమునాడు బయలు వెడలి గోల్కొండ నవాబుయు, ఖులీకుతుబ్ రశాహీకి తండ్రియుయగు యిబ్రహీంకుతుబ్ (ఇభరాముడు) కొండవీటిని గెలిచినట్లున్నది.

ఈ ఇబ్రహీంకుతుబ్ షా, అద్దంకి గంగాధర కవిచే రచింపబడిన తపతీసంువరణోపాఖ్యానమును కృతినొందెను. ఈశాసనము వలన 16వ శతాబ్దాంతమున వినుకొండ, బెల్లముకొండ, తంగెడ దుగ్గములు చెప్పుకొనదగిన బలముగలిగిన దుర్గములని తెలియుచున్నది. వివరములకు చిలుకూరి వీరభద్రరావుగారి యాంధ్రమహానీయులను గ్రంధము చూడనగును.