పుట:పల్నాటి చరిత్ర.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

పల్నాటి చరిత్ర

గురిజాల వీరభద్రాలయములో నాగుపాము బొమ్మలు గల నిలువు రాతి స్తంభము మీది యక్షరములు సరిగా కన్పించుటలేదు. తిరుమలరాయని (1567 A. D. మొదలు 1577 వఱకు రాజ్యమేలెను) పేరుమాత్రము కన్పించుచున్నది.

కంభముపాడు:— మాచర్లకు పోవు త్రోవకుత్తరముగా శక 1549 (1627 A. D.) నాటి భూదానశాసనము కలదు.

ముటుకూరు:- గ్రామమునకు తూర్పుగాగల సీతారామస్వామి గుడిలో నొక రాతిపైన శక 1576 (A. D. 1654) నాటిది శిధిలమగు శాసనము కలదు.

నడికూడె:- పాడుపడిన దేవాలయములో శక 1134 (1212 A. D.) నాటి దానశాసనమున్నది.

ఒప్పిచర్ల :- బావి వద్దనున్న పాడుపడిన దేవాలయములో శక 1221 (A. D 1299) రెండవ ప్రతాపరుద్రునినాటి శాసనము కలదు. దేవతలబావియని పిలువబడు బావి వద్ద శక 1233 (A D. 1311) నాటి శాసనము కలదు. ఒక బావిని త్రవ్వించినట్లు శక 1560 (A. D. 1638) నాటి శాసనము కలదు. దేవాలయమున కిచ్చిన దానము విషయమై శక 1541 (A.D.1619) నాటి శాసనము కలదు.

ఊరికి తూర్పుగా ఒక బావి వద్ద రెండవ ప్రతాపరుద్రుని శాసనములు రెండు ఉన్నవి. ఒకటి శక 1233 (1311 A. D.) రెండవది శక 1221 (A.D. 1299) నాటిది.

పట్లవీడు:- ఊరికి అరమైలు దూరమునగల రాతిమీది